మంగళవారం రోజున హనుమంతుని పూజిస్తే..?

శ్రీరాముడు హనుమంతునితో పరిచయం కాగానే ఆయనలోని కార్యదీక్షను గమనించారు. అంతేకాకుండా ఆయనలోని స్వామిభక్తిని పూర్తిగా విశ్వసించాడు. సీతమ్మవారిని వెతకడానికి వెళ్లిన వారిలో హనుమంతుడు మాత్రమే తన ఉంగరాన్ని ఇచ్చ

hanuman
Kowsalya| Last Updated: మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (11:05 IST)
శ్రీరాముడు హనుమంతునితో పరిచయం కాగానే ఆయనలోని కార్యదీక్షను గమనించారు. అంతేకాకుండా ఆయనలోని స్వామిభక్తిని పూర్తిగా విశ్వసించాడు. సీతమ్మవారిని వెతకడానికి వెళ్లిన వారిలో హనుమంతుడు మాత్రమే తన ఉంగరాన్ని ఇచ్చాడు. రాముడు హనుమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయాలనే ఆలోచన తప్ప ఆయనకు మరో ఆలోచన లేదు.
 
రాముడు అప్పగించిన పనిపై వెళుతున్నాననీ ఎక్కడైనా కాసేపు విశ్రాంతి తీసుకున్నా స్వామి అప్పగించిన పనిని నిర్లక్ష్యం చేసినట్లవుతుందని అన్నాడు. మైనాకుడి మనసు బాధపడకూడదనే ఉద్దేశంతో ఆ పర్వతాన్ని స్పృశిస్తూ ముందుకు సాగాడు. కార్యదీక్షలో ఉన్నవారు ఎక్కడ ఎంత మాత్రం ఆలస్యం చేయకూడదని, పని పూర్తయ్యేంత వరకు విశ్రాంచి తీసుకోకూడదని హనుమంతుడు చాటిచెప్పాడు. 
 
ఈ కారణంగానే శ్రీమన్నారాయణుడి అవతారమైన శ్రీరామచంద్రునితో అభినందనలు అందుకున్నాడు హనుమ. రామ భక్తుడైన హనుమను మంగళవారం రోజున పూజిస్తే సిరసంపదలు, సంతోషాలు చేకూరుతాయని పురాణాలలో చెబుతున్నారు. శనిదోషా ప్రభావంతో బాధపడేవారు ఈ రోజున హనుమను ఆరాధిస్తే మంచి ఫలితాలను పొందుతారు. దీనిపై మరింత చదవండి :