గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Kowsalya
Last Updated : శనివారం, 8 సెప్టెంబరు 2018 (11:08 IST)

ప్రతి శనివారం రోజున హనుమంతుని పూజిస్తే...?

ఆలయాలతో రామునితో పాటు హనుమంతుడు కూడా కొలువై భక్తులను అనుగ్రహిస్తుంటాడు. హనుమంతునిని వీరాంజనేయుడు, యోగాంజనేయుడు, భక్తాన్జనేయుడు, ధ్యానాంజనేయుడు, దాసాంజనేయుడు అనే నామాలతో స్వామివారు భక్తులచే పూజలు, అభిష

కొన్ని ఆలయాలలో రామునితో పాటు హనుమంతుడు కూడా కొలువై భక్తులను అనుగ్రహిస్తుంటాడు. హనుమంతునిని వీరాంజనేయుడు, యోగాంజనేయుడు, భక్తాన్జనేయుడు, ధ్యానాంజనేయుడు, దాసాంజనేయుడు అనే నామాలతో స్వామివారు భక్తులచే పూజలు, అభిషేకాలు అందుకుంటుంటాడు. హనుమంతునికి సింధూర అభిషేకం అంటే చాలా ఇష్టం.
 
ఆకు పూజ అంటే కూడా చాలా హనుమంతునికి ఎంతో ప్రీతి. ఇంకా చెప్పాలంటే తీపి అప్పాలు, వడలు అంటే చాలా చాలా ఇష్టం. హనుమంతుని దర్శనం చేసుకున్న తరువాత స్వామివారిని 11 ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది. ఆ తరువాత స్వామివారికి సింధూరాభిషేకం, ఆకు పూజలు చేయించి నైవేద్యంగా అప్పాలు, వడలు సమర్పించాలి. 
 
ఇలా హనుమంతునికి పూజలు చేయడం వలన స్వామివారు ప్రీతి చెందుతారు. హనుమస్వామి అనుగ్రహం వలన భయాలు, బాధలు అనారోగ్యాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని పురాణాలలో చెబుతున్నారు. గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోయి జీవితంలో ఆనందకరమైన సిరిసంపదలతో ఉంటారని ఆధ్యాత్మిక గ్రంధాలలో స్పష్టం చేయబడుతోంది.