గురువారం, 1 జనవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఆధ్యాత్మికం వార్తలు
  4. »
  5. ప్రార్థన
Written By IVR
Last Modified: బుధవారం, 4 జూన్ 2014 (12:22 IST)

హనుమత్ స్మరణాత్ భవేత్...

హనుమంతుని అవతారం అతి విశిష్టమైనది. అతని తల్లి అంజన పూర్వ జన్మలో పుంజికస్థల అనే అప్సర. ఆమె లావణ్యాన్ని చూసిన వాయుదేవుడు, కేసరి అనే వానరుని శరీరంలోకి ప్రవేశించి హనుమంతునికి తండ్రి అయ్యాడు. అందుకే ఆంజనేయుడు మనోజవం, మారుతతుల్య వేగం గలవాడు కాగలిగాడు. అంతేకాదు హనుమంతుడు బుద్ధిమంతులలోకెల్లా వరిష్ఠుడు. అపారమైన పాండిత్యం కలవాడు. సనక, సనందన, ముద్గలాది ఋషులకు హనుమంతుడు రామతత్త్వం గురించి వివరించాడని రామ రహస్యోపనిషత్తులో వివరించబడింది. 
 
హనుమంతుని స్మరించుకుంటే బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, చురుకుదనం, బుద్ధి, వాక్పటుత్వం, సిద్ధిస్తాయి. అందుకే హనుమంతుని ఇలా కీర్తించుదాం....
 
బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతా
అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్