బుధవారం, 8 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By సిహెచ్
Last Modified: శనివారం, 11 ఏప్రియల్ 2020 (21:16 IST)

ఆదివారం నాడు సూర్యారాధన చేస్తే?

ఆదివారాన్ని ఉత్తరాదిలో రవి వారం అని పిలుస్తుంటారు. రవి అంటే సూర్యుడు అని అర్థం. కనుక ఆదివారం నాడు ఆదిత్యుడికి ఆరాధన చేస్తే ఆయన అనుగ్రహం కలుగుతుంది. సూర్యుని అనుగ్రహం లేకపోతే కోరిన విద్య లభించదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
జనకమహా రాజు గురువు యాజ్ఞవల్య్కుడు సూర్యుని అశుభ దృష్టి వల్ల వేదవిద్యను అభ్యసించలేకపోయాడు. అందువల్ల తపస్సు చేసి సూర్యుని శుభదృష్టి వల్ల సరస్వతిదేవి అనుగ్రహంతో శాస్త్రజ్ఞానం పొంది, యాజ్ఞవల్య్కస్మృతిని అందించాడు. 
 
అందుకే నవగ్రహాల్లో మొట్టమొదటైన సూర్యుడిని ఆరాధన చేయాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఆదివారం నాడు మాత్రమే కాకుండా ప్రతిరోజూ ఉదయం వేళ ''జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం'' అనే మంత్రాన్ని జపిస్తే సూర్యానుగ్రహం కలుగుతుంది. 
 
సూర్యుని అనుగ్రహం కోసం మాణిక్యాన్ని ధరించాలి. గోధుమలను, ఎర్రని వస్త్రాన్ని దానం చేయాలి. పాయసం నివేదించాలి. సూర్యాష్టకం లేదా ఆదిత్యహృదయం పఠించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.