పూజలు చేసేటప్పుడు గంటను మోగించాలా? ఎందుకు?
ఆలయాలలో అమర్చే పెద్ద గంటల ప్రాధాన్యతను గురించి తెలుసుకుందాం. గంటలను ఉపయోగంచడం వలన మానసిక సమస్యలు దూరమవుతాయి. ప్రతిరోజూ పూజచేసిన తరువాత గంటలను మోగించాలని, అలాగే ఆఫీసుకు వెళ్ళేముందు ఒకసారి గంటను మోగించి
ఆలయాలలో అమర్చే పెద్ద గంటల ప్రాధాన్యతను గురించి తెలుసుకుందాం. గంటలను ఉపయోగంచడం వలన మానసిక సమస్యలు దూరమవుతాయి. ప్రతిరోజూ పూజచేసిన తరువాత గంటలను మోగించాలని, అలాగే ఆఫీసుకు వెళ్ళేముందు ఒకసారి గంటను మోగించినట్లైతే ఆ రోజంతా ఉత్సాహంగా గడిపేందుకు తగిన శక్తిని పొందుతారు.
గంటలను మోగించడంలో కూడా ఒక క్రమ పద్ధతి ఉంది. వరుసగా నాలుగైదు సార్లు గంటను మోగించరాదు. గంటలను మోగించిన తరువాత వాటి నుండి వెలువడు శబ్దాన్ని కాసేపు కళ్ళు మూసుకుని శ్రద్ధగా ఆలకించాలి. అనంతరం గంటకు కట్టిన దండాన్ని దగ్గరకు తీసుకురావాలి. శబ్దం వస్తున్న సమయంలోనే గంటకు దండాన్ని తాకనివ్వాలని వెల్లడైంది.
ఇలా దండాన్ని తాకనివ్వడం వలన గంటనుండి వచ్చే ప్రతిధ్వని దాదాపు ఓం శబ్దంలానే వినిపిస్తుంది. ఈ శబ్దం వింటూ మీరు ధ్యానంలోకి నిమగ్నమవుతారు. ఒక నిమిషం పాటు ఆనంద పరవశంలో తేలిపోతుంటారని ఏదో తెలియని అద్భుత శక్తి మీ మనస్సులో ప్రవేశిస్తుందని శాస్త్రం చెబుతోంది.