శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By ivr
Last Modified: సోమవారం, 17 జులై 2017 (14:47 IST)

ఆఫీసులోనే టైమంతా కిల్... భార్యతో గొడవలెందుకు? పరిష్కారమేంటి?

పోటీ ప్రపంచంలో నేడు చాలామంది యువతీయువకులు ఆఫీసునే ఓ ప్రపంచంలా భావించే రోజులు. అందుకే వారు ఇతర వ్యాపకాల కంటే.. తమ జాబ్‌పైనే దృష్టి కేంద్రీకరించి గంటలకొద్ది ఆఫీసుకే పరిమితమైపోతుంటారు. ఇలాంటి వారు తమ సంసారంలో పలు సమస్యలను ఎదుర్కొంటుంటారు. ప్రధానంగా... ఉ

పోటీ ప్రపంచంలో నేడు చాలామంది యువతీయువకులు ఆఫీసునే ఓ ప్రపంచంలా భావించే రోజులు. అందుకే వారు ఇతర వ్యాపకాల కంటే.. తమ జాబ్‌పైనే దృష్టి కేంద్రీకరించి గంటలకొద్ది ఆఫీసుకే పరిమితమైపోతుంటారు. ఇలాంటి వారు తమ సంసారంలో పలు సమస్యలను ఎదుర్కొంటుంటారు. ప్రధానంగా... ఉదయం వెళ్లి రాత్రి 10, 11 గంటలకు వచ్చే వారి పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంటుంది. 
 
ఆఫీసులో పని ఒత్తిడి కారణంగా ఇంటికి ఆలస్యంగా చేరుకుంటుంటారు. వీరు ఇంటికి వెళ్లే సమయానికి భార్య నిద్రపోవడం జరుగుతుంది. దీంతో రోజులు వారాలు, నెలలు గడుస్తున్నా శృంగారానికి దూరంగా ఉండటం జరుగుతుందని పలు సర్వేలు ఇప్పటికే తేటతెల్లం చేశాయి. ఫలితంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తి విడిపోయే ప్రమాదం ఉందని కూడా వారు నొక్కి వక్కాణిస్తున్నారు. 
 
ఇలాంటి సమస్యలను అధిగమించాలంటే దంపతులు ప్రత్యేకంగా టైం షెడ్యూల్ వేసుకోవాలి. ఎందుకంటే శృంగారం అనేది శారీరక, మానసిక భావోద్వేగ సమ్మిళితమైన ఒక వ్యక్తీకరణ. దంపతులు పరస్పరం ప్రేమను వ్యక్తపరచుకునే అద్భుతమైన దేహభాష. మానసిక సాన్నిహిత్యాన్ని పెంచి ఇరువురినీ ఒక్కటిగా చేసే మాధ్యమం. శృంగారంలో పాల్గొనడం వల్ల స్త్రీపురుషులిరువురిలోనూ ఆరోగ్యవంతమైన, ప్రేమోద్వేగాలను మరింత పెంచే రసాయనాలు, హార్మోన్లు విడుదలవుతాయని చెపుతున్నారు. 
 
అంతేకాకుండా, వీటితోపాటు నిరాశ నిస్పృహలు, బాధ, కోపం, చిరాకు, ఆందోళన వంటి ప్రతికూల భావోద్వేగాలకు కూడా అవి అడ్డుకోగలవని చెపుతున్నారు. శృంగారంలో పాల్గొనటం వల్ల విడుదలయ్యే హార్మోన్ల వల్ల శారీరక, మానసిక ఉల్లాసం పెరుగుతుందని, ఒత్తిడి, చిరాకు తగ్గి, స్త్రీలలో పీరియడ్స్ సక్రమంగా వస్తాయని చెపుతున్నారు. ఊపిరి సలపని జీవితంలో ప్రతిదాన్ని విభజించుకుంటూ తగిన సమయాన్ని కేటాయించి అనుభవించడం నేర్చుకోవాలని సూచిస్తున్నారు. 
 
భార్యాభర్తలిద్దరూ వారానికి రెండు రోజులు ఖచ్చితంగా శృంగార దినాలుగా ప్రకటించుకొని, ఆ రోజుల్లో పనులు తగ్గించుకొని, వేళకు ఇంటికి రావాలని సలహా ఇస్తున్నారు. సమయానికి అనుగుణంగా మానసికంగా మంచి మూడ్‌ని తెచ్చుకుని, సెలవు రోజును ఇద్దరూ కలసి ఇలా సద్వినియోగపరచుకోవాలని సలహా ఇస్తున్నారు.