శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By tj
Last Updated : ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (12:58 IST)

అక్షరాభ్యాసం - అంతరార్థం తెలుసా.. ఓనమాలు దిద్దించటం అంటే ఏమిటి..?

వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం చేయించడం అనేది అనాది కాలంగా ఆచారంగా వస్తూ ఉంది. సాధారణంగా అమ్మ ఆవిర్భావ దినం రోజు విద్య మొదలుపెడితే సకల విద్యలు సులభంగా సుసాధ్యం అవుతాయి అనేది నమ్మకం. యజ్ఞం, పూజలు, అర్చనల

వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం చేయించడం అనేది అనాది కాలంగా ఆచారంగా వస్తూ ఉంది. సాధారణంగా అమ్మ ఆవిర్భావ దినం రోజు విద్య మొదలుపెడితే సకల విద్యలు సులభంగా సుసాధ్యం అవుతాయి అనేది నమ్మకం. యజ్ఞం, పూజలు, అర్చనలు పూర్తి అయిన తరువాత పంతులు తమ చిన్నారిని ఒడిలో కూర్చోబెట్టుకుని పలక మీద బలపంతో ఓం నమ.. శివాయ సిద్ధం నమ.. అని రాసి దిద్దిస్తారు.
 
సరస్వతి మాత పుట్టిన రోజు నాడు ఆ వాక్దేవి పూజ చేస్తే ఆమె పేరుతో అక్షరాలు దిద్దించాలి కదా మరి ఈ ఓనమాలు ఎక్కడ నుంచి వచ్చాయి అనేది ప్రశ్న. మనది తెలుగు నేల. మనది తెలుగు భాష. తెలంగాణా, ఆంధ్ర ప్రాంతాలలో ఉండే మన మంతా తెలుగు వారం. మరి ఈ తెలుగు కానీ తెలంగాణ పదాలు ఎలా వచ్చాయి..?
 
మన ప్రాంతాన్ని ఒకప్పుడు త్రిలింగ దేశం అనే వారు. ఉత్తరమున వేములవాడ లేదా కాళేశ్వరం దక్షిణాన శ్రీకాళహస్తి తూర్పున ద్రాక్షారామము మూడు లింగాల మధ్య గల భూభాగం త్రిలింగ క్షేత్రంగా వెలసింది. ఈ త్రిలింగ శబ్దము నుండే తెలుంగు తెలుగు తెలంగాణ పదాలు ఉద్భవించాయని భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం. ఎప్పటి నుంచి ఈ ఆచారము ఉన్నదో తెలియదు కానీ చరిత్రకు అందని కాలం నుంచి అక్షరాభ్యాసము ఓనమాలు దిద్దించే సాంప్రదాయం కేవలం మన తెలుగు ప్రాంతా సొంతం.
 
ఓం నమ:శివాయ శివ పంచాక్షరి మహ మంత్రముతో అక్షరాలు మొట్టమొదటగా వాయించటం అనేది కేవలం మన తెలుగు వారి సాంప్రదాయం. అందుకు మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉంటాము. కానీ ఇప్పుడు బాధ పడాల్సిన విషయం ఏమిటంటే ఆంగ్ల బాషా వ్యామోహంలో పడి మనం అంతా తెలుగును మరిచిపోయి ఎబిసిడి లు మ్మీ డాడిలు అంటున్నాము. మన చిన్నారి పసిపిల్లల చేత అనిపిస్తూ సంతోషపడుతున్నాము. మన తెలుగు బాషను మనమే నాశనం చేసుకుంటున్నాం. ఇదీ దౌర్భాగ్యం. 
 
అప్పయ్య దీక్షితులు అనే పరమ శివభక్తుడు ఇటీవల కాలంలో ఉండేవారు. ఆయన పుట్టింది తమిళ ప్రాంతంలో ఆయన అనేక శివస్త్రాతాలు రచించారు. అకారాది కక్షారం వరకు మొదటి అక్షరాలుగా ఒక అద్భుత స్తోతం ఆయన వ్రాసినదే. ఆయన చివరి దశలో మీ కోరిక ఏమిటి అంటే అయ్యా నాకు మరు జన్మ అంటూ ఉంటే నన్ను తెలుగు నేల పై జన్మించేటట్టుగా చేయి అని ఆ శివయ్యను వేడుకుంటున్నాను. ఎందుకంటే ఓం నమ:శివాయ అనే పంచాక్షరితో ఓనమాలు దిద్దే సాంప్రదాయం తెలుగు నేత సొంతం. ఇక్కడ పుడితే నాకు శివభక్తి మరింత ఎక్కువగా అలవడుతుంది అని కోరుకున్నారట.
 
అందుకేనేమో ఆ చదువుల తల్లి వ్యాస మహర్షి చేత ప్రతిష్టించబడి ఇక్కడ ఈ తెలుగు నేలపై గోదావరి తీరంలో బాసర క్షేత్రంలో జ్ఞాన సరస్వతిగా వేల కొలది జనుల చేత పూజలందుకుంటున్నది. మనం ఎంత భాగ్యవంతులం. మన తెలుగు బాషను మనమే కాపాడుకుందాం. మన పిల్లలకు తెలుగు తీయదనమును రుచి చూపించే బాధ్యత తల్లిదండ్రులుగా మనదే. లేకపోతే భగవంతుడు క్షమించడు. నిజమం మమ్మీ.. డాడీ వద్దు. అమ్మా. నాన్నే.