శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 16 అక్టోబరు 2019 (22:01 IST)

నేతి అన్నంతో దానం చేసి దేవునికి తలనీలాలు సమర్పిస్తే?

దోషాలకు పరిహారం చేసుకోవడం తెలిసిందే. ఐతే ఆయా దానాలు ఆయా ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా అన్నదానం చేయడం ద్వారా ఎన్ని సమస్యలు ఉన్నా పరిహారం అవుతాయి. అన్నంతో పాటు మోదక దానాన్ని చేయడం ద్వారా సమస్యలు తొలగిపోతాయి. దానాన్ని మాత్రం దైవ భక్తులకు తాంబూలంతో పాటు దక్షిణ ఉంచి దంపతులకు ఇవ్వాలి. 
 
ఇంట్లో ఖర్చు ఎక్కువగా ఉండి ఆదాయం తక్కువగా ఉన్నవారం అన్నంలో నేయి వేసి లేదా నేతి అన్నంతో లడ్డుపెట్టి తాంబూలం దానం చేస్తే మీ జీవితంలో అధిక ఆదాయం సంపాదన కలగడంతో పాటు శ్రీమంతులుగా మారిపోతారని జ్యోతిష నిపుణులు చెపుతున్నారు. 
 
చాలా సంవత్సరాలుగా రోగాలతో బాధపడేవారు నేతి అన్నంతో దానం చేసి దేవునికి తలనీలాలు సమర్పిస్తే అన్ని రోగాలు తొలగి ఆరోగ్యవంతులవుతారు. చిత్రాన్నంతో పాటు వడ దానం చేస్తే మీ ఇంటిపై జరుగుతున్న అన్ని మాంత్రిక దోషాలు తొలగిపోతాయి. నేతి అన్నంతో పాటు పేనీలు దానం చేస్తే పితృశాపాలు తొలగిపోతాయి. బెల్లం అన్నం దానం చేస్తే మీరు శ్రీమంతులు అవుతారని పండితులు చెబుతున్నారు.