గురువారం, 5 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 12 ఆగస్టు 2016 (15:12 IST)

శాస్త్రోక్తంగా జరిగే పెళ్లిళ్ళకు ముక్కోటి దేవతలు - దేవుళ్లు దిగివస్తారట

పెళ్లంటే నూరేళ్ల పంట. పెళ్లిళ్లు స్వర్గంలోనే నిశ్చయింపబడుతాయని పెద్దలు అంటుంటారు. ప్రతి మనిషి జీవితంలో జరిగే పెళ్లి వేడుక జీవితంలో మరచిపోలేని మధురమైన స్మృతిగా మిగిలిపోతుంది. అందుకే పెళ్లంటే నూరేళ్ళ పం

పెళ్లంటే నూరేళ్ల పంట. పెళ్లిళ్లు స్వర్గంలోనే నిశ్చయింపబడుతాయని పెద్దలు అంటుంటారు. ప్రతి మనిషి జీవితంలో జరిగే పెళ్లి వేడుక జీవితంలో మరచిపోలేని మధురమైన స్మృతిగా మిగిలిపోతుంది. అందుకే పెళ్లంటే నూరేళ్ళ పంట అన్నారు. బంధువుల రాకతో పెళ్లి కళకళలాడిపోతుంది. నిజానికి పెళ్లికి బంధువులే కాదు దేవతలు కూడా దిగి వస్తారట. వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా జరిగే పెళ్ళి ప్రథమంగా గణపతి పూజతో ప్రారంభమౌతుంది. అందుకే తొలుత మూషిక వాహనుడు గణపతి వస్తాడట. 
 
నూతన వధూవరులను ఆశీర్వదించడానికి శ్రీ మహావిష్ణువు సతీసమేతంగా పెళ్ళి మండపానికి వస్తునాడనే సమాచారాన్ని గరుడుడు దేవతలందరికీ వర్తమానం పంపుతారట. స్వామికి స్వాగతం పలికేందుకు అష్ఠదిక్పాలకులు వివాహవేదిక వద్దకు విచ్చేస్తారట. అంతేకాదు వీరితోపాటుగా వైకుంఠ - కైలాస వాసులు, వశిష్ఠ, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, కశ్యప, జమదగ్ని వంటి సప్తమహర్షులు మండపానికి వస్తారట. 
 
చివరగా లక్ష్మీదేవితో సహా శ్రీ మహావిష్ణువు వచ్చి సర్వ వివాహ ధర్మాన్నీ గమనించి నూతన దంపతులను ఆశీర్వదిస్తారట. దేవతలే దిగి వచ్చి ఆశీర్వచనాలు అందిస్తే నూతన దంపతులకి అంతకంటే భాగ్యమేముంటుంది చెప్పండి.