శనివారం, 15 ఫిబ్రవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (20:17 IST)

అలాంటి వాడిది ప్రేమ ఎలా అవుతుంది? అది కామం: చాగంటి ప్రవచనం

Chaganti Koteswara Rao
ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు గారు యువతలోని ఆలోచనా విధాలను సరైన మార్గంలో పెట్టుకోవాలంటూ ఎన్నో సూచనలను తమ ప్రవచనాల ద్వారా చేస్తుంటారు. ఆమధ్య ఆయన చెప్పిన ప్రవచనాలలో కొన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
 
"రోడ్డు పైన అందమైన యువతి నడుచుకుంటూ వెళుతుంది. ఆమెను ఒకడు చూసి పెళ్లాడాలనుకుంటాడు. కానీ ఆమెను అల్లారుముద్దుగా పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులకు తమ కుమార్తెకి యోగ్యుడైన వరుడినిచ్చి పెళ్లి చేయాలనుకుంటారు కదా. మరైతే ఇతనెవరు... ఆమెను చూడగానే పెళ్లి చేసుకోవడానికి. ఆమె నాకే సొంతం అని ఎవడైతే అనుకుంటాడో అతడిది ప్రేమ కాదు కామం. ఈ కామం కారణంగా తను ఆ యువతిని ఏమి చేయడానికైనా సిద్ధపడతాడు. కనుక ఎవరైతే చెడు దృష్టికోణంలోకి వెళ్తున్నామని అనిపిస్తుందో వెంటనే మార్చుకోవాలి''