1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (15:46 IST)

అట్ల తద్దె రోజున ఉమాదేవిని పూజిస్తే..?

శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని మహిళలు భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. విశేషమైన పర్వదినాల్లో అధికంగా పూజిస్తుంటారు. సకల సౌభాగ్యాలు ప్రాసాదించేవారు, జీవితాన్ని ఆనందింపజేయువారు అమ్మవారేనని మహిళలు భావిస్తుంటారు. ముఖ్యంగా అట్లతద్దె రోజున అమ్మవారిని ఎక్కువగా

శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని మహిళలు భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. విశేషమైన పర్వదినాల్లో అధికంగా పూజిస్తుంటారు. సకల సౌభాగ్యాలు ప్రాసాదించేవారు, జీవితాన్ని ఆనందింపజేయువారు అమ్మవారేనని మహిళలు భావిస్తుంటారు. ముఖ్యంగా అట్లతద్దె రోజున అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తుంటారు.
  
 
ఆశ్వయుజ బహుళ తదియ రోజున జరిపే అట్లతద్దె నాడు ఉమాదేవిని పూజించాలని పురాణాలలో చెబుతున్నారు. అలానే ఈ రోజున చంద్రోదయం వరకు ఉపవాస దీక్షను చేపట్టి ఆ అమ్మవారికి అట్లను నైవేద్యంగా సమర్పించాలి. అలానే ముత్తయిదువులకు వాయనం ఇవ్వాలి. ఈ రోజున ఈ నోమును ఆచరించడం వలన వివాహం కానివారికి గుణవంతుడైన భర్త లభిస్తాడు. వివాహమైనవారికి నిండు ఐదవతనం లభిస్తుందని చెబుతున్నారు.