శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By ivr
Last Modified: శనివారం, 15 సెప్టెంబరు 2018 (17:53 IST)

రొయ్యల పకోడి భలే టేస్ట్... ఎలా చేయాలో తెలుసా?

కావలసినవి: రొయ్యలు- పావు కిలో. ఉప్పు- రెండు టీ స్పూన్లు. శెనగపిండి - ఒక కప్పు. వెల్లుల్లి పేస్టు - ఒక టీ స్పూన్. పసుపు - అర టీ స్పూన్. ఎర్రకారం - అర టీ స్పూన్. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు - ఒక టీ స్పూన్. కొత్తిమీర తరుగు - ఒక టీ స్పూన్. ఆమ్చూర్

కావలసినవి: 
రొయ్యలు- పావు కిలో.
ఉప్పు- రెండు టీ స్పూన్లు.
శెనగపిండి - ఒక కప్పు.
వెల్లుల్లి పేస్టు - ఒక టీ స్పూన్.
పసుపు - అర టీ స్పూన్.
ఎర్రకారం - అర టీ స్పూన్.
సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు - ఒక టీ స్పూన్.
కొత్తిమీర తరుగు - ఒక టీ స్పూన్.
ఆమ్చూర్ - ఒక టీ స్పూన్.
నీళ్లు - రెండు కప్పులు.
నూనె - వేగించడానికి సరిపడా.
 
ఎలా తయారు చేయాలి?
రొయ్యలను బాగా కడగాలి... నీళ్లు వుండకుండా వార్చేయాలి. శెనగపిండి, వెల్లుల్లి పేస్టు, ఉప్పు, ఎండుకారం మిశ్రమంలో తగినన్ని నీళ్లు పోసి చిక్కటి పేస్టులా చేసుకోవాలి. దాంట్లో అవసరాన్ని బట్టి నీళ్లు పోసి పిండిని కాస్త పలుచగా చేసుకోవచ్చు. బాణలిలో సరిపడా నూనె పోసి వేడి చేయాలి. ఆ తర్వాత రొయ్యలను ఈ పిండిలో ముంచి సన్నని మంటపైన నూనెలో వేసి లేత బంగారువర్ణంలోకి వచ్చేదాకా వేయించాలి. అలా వేగాక చిల్లు గరిటెతో పకోడిని బయటకు తీయాలి. వాటిని నూనె పీల్చే టిష్యూ కాగితంపై కాసేపు వుంచాలి. అంతే... రొయ్యల పకోడి రెడీ.