శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 29 జూన్ 2021 (21:48 IST)

వివాహంలో వధూవరులు ఏడడుగులు

వివాహ సమయంలో వధూవరులిద్దరూ కలిసి నడిచే ఏడడుగుల వెనుక అర్థం దాగి వుంది. ఈ ఏడడుగులనే సప్తపది అన్నారు. వాటి అర్థం ఏమిటో తెలుసుకుందాం.
 
మొదటి అడుగు
"ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు"
ఈ మొదటి అడుగుతో విష్ణువు మనిద్దరిని ఒక్కటి చేయుగాక!"
 
రెండవ అడుగు..
"ద్వే ఊర్జే విష్ణుః త్వా అన్వేతు"
ఈ రెండవ అడుగుతో విష్ణువు మనిద్దరికీ శక్తిని ఇచ్చుగాక
 
మూడవ అడుగు
త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు" ఈ మూడవ అడుగుతో విష్ణువు వివాహవ్రతసిద్ధిని అనుగ్రహించుగాక.
 
నాలుగవ అడుగు
"చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు" ఈ నాలుగవ అడుగుతో విష్ణువు మనకు ఆనందమును కలిగించుగాక.
 
ఐదవ అడుగు
"పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు" ఈ ఐదవ అడుగుతో విష్ణువు మనకు పశుసంపదను కలిగించుగాక.
 
ఆరవ అడుగు
"షడృతుభ్యో విష్నుః త్వా అన్వేతు " ఈ ఆరవ అడుగుతో ఆరు ఋతువులు మనకు సుఖమును ఇచ్చుగాక.
 
ఏడవ అడుగు
"సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు" ఈ ఏడవ అడుగుతో విష్ణువు మనకు గృహాస్తాశ్రమ ధర్మనిర్వహణకు అనుగ్రహమిచ్చుగాక. మొత్తం జీవితానికి అవసరమయిన అంశాలన్నింటిని ఈ ఏడు అడుగుల్లోకి ఇమిడ్చి ప్రామాణికంగా రూపొందించడాన్నే సప్తపది అని అంటారు.