పళని దండాయుధ పాణి ఆలయంలో కుంభాభిషేకం (video)
పళని దండాయుధ పాణి ఆలయంలో జనవరి 27న కుంభాభిషేకం అట్టహాసంగా జరిగింది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు జరిగింది. దండాయుధపాణి స్వామి ఆలయం తమిళనాడు దిండుక్కల్ జిల్లాలోని పళనిలో ఉంది. కుమార స్వామి ప్రతిష్టాత్మక ఆరు క్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయంలోని మూలవిరాట్టు నవపాషాణంతో రూపుదిద్దుకుంది.
పాదవినాయకుడు, క్షేత్రపాలకులు, 5 నెమలి విగ్రహాలు, మెట్ల దారి క్షేత్రాలు, వినాయగర్ విగ్రహాలు, ఇడుంబన్, కడంబన్, అగస్త్యుడు, సర్ప వినాయకుడు, జంట వినాయకుల విగ్రహాలకు కుంభాభిషేకం జరుగనుంది.
ఈ పళని ఆలయంలో 16 ఏళ్ల తర్వాత 27వ తేదీన కుంభాభిషేకం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి 9.30 గంటల మధ్య రాజగోపురం, స్వర్ణ విమానానికి తీర్థ అభిషేకం, అనంతరం స్వామివారికి కుంభాభిషేక కార్యక్రమం నిర్వహించారు.
కుంభాభిషేకం సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున 4.30 గంటలకు 8వ యాగశాల పూజలు ప్రారంభమయ్యాయి. కుంభాభిషేకం సందర్భంగా దీపారాధన అనంతరం రాజగోపురంతో పాటు ఆలయ సముదాయం అంతటా హెలికాప్టర్‌లో పుష్పయాగం నిర్వహించారు. ఇందుకోసం బెంగళూరు నుంచి ప్రైవేట్ హెలికాప్టర్‌ను రప్పించారు.