గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 10 మే 2017 (18:36 IST)

మూఢ నమ్మకం అని కొట్టిపారేస్తున్నారా? మహిళలు గాజులు ధరించడం వెనుక?

ప్రపంచంలో ఎక్కడాలేనన్ని మతాలు, మూఢ నమ్మకాలు మన దేశంలోనే ఉన్నాయి. వీటిని కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రజలు పాటిస్తూ వస్తున్నారు. కానీ, నేటి యువతి ఈ మూఢ నమ్మకాలను ఏమాత్రం పట్టించుకోరు కదా.. కొట్టిపారేస్

ప్రపంచంలో ఎక్కడాలేనన్ని మతాలు, మూఢ నమ్మకాలు మన దేశంలోనే ఉన్నాయి. వీటిని కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రజలు పాటిస్తూ వస్తున్నారు. కానీ, నేటి యువతి ఈ మూఢ నమ్మకాలను ఏమాత్రం పట్టించుకోరు కదా.. కొట్టిపారేస్తుంటారు. నిజానికి ఈ మూఢనమ్మకాల వెనుక సైన్స్ దాగివుంది. ఆ విషయాలేంటో ఓసారి తెలుసుకుందాం. 
 
మహిళలు గాజులు వేసుకోవడం వెనుక కూడా ఓ రహస్యం వుంది. పూర్వకాలంలో మగవారు మాత్రమే రోజూ బయటకు వెళ్లి బాగా కష్టపడి పని చేసేవారు. మహిళలు ఇంటికే పరిమితమయ్యేవారు. అందుకే వారి కోసం గాజులు చేశారని చెపుతారు. ఆడవారు గాజులను ధరించడం వల్ల అవి ఎపుడూ చేతి నరాలను తాకుతూ ఉండటం వల్ల బీపీ కంట్రోల్‌గా ఉంటుందని, అనారోగ్య సమస్యలు దరిచేరవని నమ్ముతారు. ముఖ్యంగా ఆడవారి నుంచి వచ్చే నెగెటివ్ ఎనర్జీ వారి నుంచి పుట్టకుండా చేస్తాయట.
 
అలాగే, ఆడవారు మెట్టెలు ధరించడం వల్ల ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి గుండె నుంచి గర్భాశయానికి రక్త ప్రసరణ అనేది మంచిగా జరుగుతుందంట. దానివల్ల ఆడవారిలో రుతుక్రమం సరిగా ఉంటుందని చెపుతున్నారు. ఆడవాళ్లు వెండి మెట్టెలు ధరించడం వల్ల ప్రకృతిలో ఉండే పాజిటివ్ శక్తి వారి శరీరంలోకి వస్తుందంటా.