అలాంటి వాడిని నట్టడవిలో ఒక చెట్టుకు కట్టివేసినా....
సతిమూలే తద్విపాకో జాత్యాయుర్భోగాః... అంటే కర్మ పరిపాకం వల్ల, జాతి-ఆయువు-భోగం అనేవి కలుగుతాయి. కారణాలైన సంస్కారాలు, కర్మానుభవం అనే కార్యరూపంలో వ్యక్తమవుతుంటాయి. కారణం అంతరించి, కార్యరూపాన్ని దాలుస్తుంది. కార్యం రానురాను సూక్ష్మమై మరొక కార్యానికి కారణ
సతిమూలే తద్విపాకో జాత్యాయుర్భోగాః... అంటే కర్మ పరిపాకం వల్ల, జాతి-ఆయువు-భోగం అనేవి కలుగుతాయి. కారణాలైన సంస్కారాలు, కర్మానుభవం అనే కార్యరూపంలో వ్యక్తమవుతుంటాయి. కారణం అంతరించి, కార్యరూపాన్ని దాలుస్తుంది. కార్యం రానురాను సూక్ష్మమై మరొక కార్యానికి కారణమవుతుంటుంది. విత్తనం వృక్షానికి, వృక్షం విత్తనానికి కారణమవుతుంటాయి.
మన ప్రస్తుత కర్మలన్నీ పూర్వ సంస్కార ఫలితాలై ఉంటాయి. మరలా ఈ కర్మలు రానున్న కర్మలకు కారణమవుతుంటాయి. సంస్కారాలు కారణాలై ఉండటం వల్ల వాటి పరిపాకం జీవకోటిలో ఒకటి మనిషిగా, మరొకటి దేవతగా, వేరొకటి జంతువుగా, ఇంకొకటి రాక్షసుడుగా వ్యక్తమవుతుంటాయని భావం.
కర్మ ఫలాలు ఒకేవిధంగా ఉండవు. ఒకడు యాభైయేండ్లు బ్రతుకుతాడు. మరొకడు నూరేండ్లు బ్రతుకుతాడు. మరొకడు పుట్టిన రెండేండ్లకే చస్తాడు. ఈ భేదాలన్నీ వారివారి పూర్వ కర్మానుగుణంగా కలుగుతుంటాయి. ఒకడు సుఖించటానికే జన్మించాడా అన్నట్లుగా ఆజన్మాంతం సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు. అలాంటివాడిని నట్టడవిలో ఒక చెట్టుకు కట్టివేసినా, సుఖాలు వెదుక్కుంటూ అతని వద్దకు వస్తాయి. మరొకడు ఎక్కడికి వెళ్లినా, దుఃఖాలు అతన్ని వెంటాడుతూనే ఉంటాయి.
సర్వం అతనికి దుఃఖకరంగానే పరిణమిస్తుంది. ఇదంతా వారివారి పూర్వకర్మల ఫలం. సత్కర్మలెప్పుడూ సుఖ హేతువులని, దుష్కర్మలు సదా దుఃఖదాయకాలని యోగులు చెప్తారు. దుష్కర్మలు చేసినవాడు, దుఃఖరూపంలో వాటి ఫలం అనుభవించక తప్పదు.