బుధవారం, 27 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: శనివారం, 13 మే 2017 (19:31 IST)

బొమ్మను దేవుడనుకుని పూజించవచ్చు... కానీ దేవుడే బొమ్మ అనుకోరాదు...

లోకంలో కనిపించే చెడు అంతా అజ్ఞాన ప్రభావమే. మానవుడు జ్ఞానిగానూ, విశుద్ధుడిగానూ విద్యావంతుడు గానూ, బలాఢ్యుడు గానూ అయిన తర్వాతే లోకంలోని దుఃఖం ఉపశమిస్తుంది. అంతేకానీ ప్రతి ఇంటిని మనం ధర్మసత్రంగా మార్చినా, దేశాన్నంతా చికిత్సాలయాలతో నింపినా, మానవుడి శీలం

లోకంలో కనిపించే చెడు అంతా అజ్ఞాన ప్రభావమే. మానవుడు జ్ఞానిగానూ, విశుద్ధుడిగానూ విద్యావంతుడు గానూ, బలాఢ్యుడు గానూ అయిన తర్వాతే లోకంలోని దుఃఖం ఉపశమిస్తుంది. అంతేకానీ ప్రతి ఇంటిని మనం ధర్మసత్రంగా మార్చినా, దేశాన్నంతా చికిత్సాలయాలతో నింపినా, మానవుడి శీలం మార్పు చెందేవరకూ దుఃఖం అతడి వెన్నంటే వుంటుంది. 
 
ఒక బొమ్మను దేవుడని మనం పూజించవచ్చు, కానీ దేవుణ్ణి బొమ్మగా భావించరాదు. ప్రతిమలో భగంవతుడున్నాడని తలచడం తప్పుకాదు కానీ భగవంతుడే ప్రతిమ అని అనుకోకూడదు. దేనినైనా ఇతరులకు ఇచ్చేందుకు చేయి చాపేవాడు మహోత్కృష్ష స్థానాన్ని అలంకరిస్తాడు. ఎల్లప్పుడూ ఇతరుకు ఇవ్వడం కోసమే చేయి రూపొందించబడింది. మీరు ఆకలితో బాధపడుతున్నా, మీ వద్ద ఉన్న ఆఖరి కబళం వరకూ పరులకు ఇచ్చివేయండి. ఇతరులకు ఇచ్చేసి మీరు క్షుద్భాధ వల్ల ఆత్మార్పణ చేసుకుంటే క్షణంలో ముక్తి మీ ముంచేతి కంకణమవుతుంది. ఇలా చేసిన మంగళముహూర్తంలో పరిపూర్ణత సిద్ధిస్తుంది.