శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Mohan
Last Updated : గురువారం, 28 డిశెంబరు 2017 (22:01 IST)

వైకుంఠ ఏకాదశి... ఉత్తర ద్వారం నుంచి విష్ణు దర్శనం మహా పుణ్యం...

ఈ నెల 16వ తేదీన ధనుర్మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందుగా వచ్చే శుద్ధ ఏకాదశినే "వైకుంఠ ఏకాదశి" లేదా "ముక్కోటి ఏకాదశి" అంటారు. ఈ నెల 29వ తేదీన (శుక్రవారం) నాడు ఈ పర్వదినం రాబ

ఈ నెల 16వ తేదీన ధనుర్మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందుగా వచ్చే శుద్ధ ఏకాదశినే "వైకుంఠ ఏకాదశి" లేదా "ముక్కోటి ఏకాదశి" అంటారు. ఈ నెల 29వ తేదీన (శుక్రవారం) నాడు ఈ పర్వదినం రాబోతోంది. సూర్యుడు ధనస్సులో ప్రవేశానంతరం మకర సంక్రమణం సంభవించే మధ్య కాలంలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఆ రోజు వైష్ణవాలయాలలో ఉత్తర ద్వారం వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో పాటు భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలగజేస్తాడని హిందూ ధర్మాలు చెబుతున్నాయి. 
 
ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశిలతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందున దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయని, శివుడు ఈ రోజే హాలాహలాన్ని త్రాగాడని ప్రతీతి. అంతేకాకుండా మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశం చేసాడని విశ్వాసం ఉంది.
 
మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజున వైకుంఠద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. తద్వారా భక్తులు ఆ ద్వారం ద్వారా వెళ్లి దర్శనం చేసుకుంటారు. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు చేస్తుంటారు, మరీ ముఖ్యంగా ఉపవాసం, జాగరణ చేస్తూ దేవదేవుడిని కొలుస్తారు. తిరుమలలో స్వామివారు వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు ప్రత్యేక దర్శనాన్ని కలగజేస్తాడు.