గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: మంగళవారం, 19 డిశెంబరు 2017 (21:30 IST)

అందరి కోర్కెలు తీర్చే దత్తాత్రేయుడు, శ్రీ షిరిడీ సాయి

దత్తాత్రేయుడు అనే పేరులో తత్వపరమైన రహస్యార్థం ఉంది. సమస్త ప్రాణకోటికి ప్రాణరూపంగా తనకు తానుగా దత్తమైనాడు గనుక దత్తుడని, అత్రి మహర్షి వరపుత్రుడు గనుక ఆత్రేయుడని, ఈ రెండు పదాల కలయికతోనే స్వామివారికి దత్తాత్రేయుడనే పేరు వచ్చింది. దత్తాత్రేయం బ్రహ్మరంద్ర

దత్తాత్రేయుడు అనే పేరులో తత్వపరమైన రహస్యార్థం ఉంది. సమస్త ప్రాణకోటికి ప్రాణరూపంగా తనకు తానుగా దత్తమైనాడు గనుక దత్తుడని, అత్రి మహర్షి వరపుత్రుడు గనుక ఆత్రేయుడని, ఈ రెండు పదాల కలయికతోనే స్వామివారికి దత్తాత్రేయుడనే పేరు వచ్చింది. దత్తాత్రేయం బ్రహ్మరంద్రస్థ అని చెప్పడం చేత దత్తుని స్థానం సహస్రార చక్రం. దీనినే బ్రహ్మరంధ్రం అంటారు. 
 
సాధకులకు దత్తమయ్యే శక్తి దత్త రూపంలో ఉన్న పరబ్రహ్మ శక్తేనని వేరుగా చెప్పవలసిన పనిలేదు. భిన్నత్వంలోని ఏకత్వ దర్శనం ప్రసాదించగడానికే జ్ఞాన స్వరూపమైన దత్తావతారం ఉద్భవించింది. మూడు గుణాలు వీరివే. త్రిగుణాత్మకుడు,
 
త్రిగుణాతీతుడుగా, గురుదేవదత్తగా ఆ పరబ్రహ్మ అవతరించారు. మహా పతివ్రతైన అనసూయదేవిని పరీక్షించే నిమిత్తం త్రిమూర్తులు యతీశ్వరుల రూపంలో వచ్చి, నగ్నంగా భిక్ష వడ్డించమని అడగడం, ఆమె వారిని పసిపిల్లలుగా మార్చడం, త్రిమాతలు రావడం, త్రిమూర్తులను త్రిమాతలకు అనసూయదేవి అప్పగించడం, త్రిమాతలు, త్రిమూర్తులు సంతోషంగా అత్రి, అనసూయలకు వరం ఇవ్వడం వల్ల దత్తాత్రేయుల జననం జరిగిందని కధనం.
 
దత్తవతారం దశావతారాలకంటే ఎంతో పురాతనమైనది. అన్ని అవతారాలు తమకు నిర్ధేశించిన కార్యము పూర్తిచేసుకొని ఈ లోకమునుండి నిష్క్రమించాయి. దత్త అవతారం మాత్రం నిత్య సత్యావతారంగా విరాజిల్లుతూనే ఉంది. ఇది శిష్టరక్షణకు, దుష్టశిక్షణకు కొరకే గాక, ప్రజలకు జ్ఞానప్రభోధం చేసి, వారిని సన్మార్గంలో చేయడానికి వచ్చిన విలక్షణ అవతారం. ఏ అవతార మూర్తికీ లేని గురుదేవ అన్న విశేషణం దత్తాత్రేయుల వారికి మాత్రమే ఉంది. అసలు గురుశబ్దం పుట్టింది వీరి నుండే. అందరికంటే జ్ఞానులైన పెద్దవారినే మనం గురువులుగా భావిస్తాము. సమస్త ప్రాణకోటికే కాకుండా సర్వదేవతలకు గురువు దత్తాత్రేయుడు ప్రతి యుగంలోను వేళ్ళమీద లెక్కపెట్ట గలిగినంత మంది రాక్షసులు మాత్రమే లోకాలను గడగడలాడించడం, వారిని సమహరించడానికి అమ్మవారో, అయ్యవారో ప్రత్యేక అవతారాలు ఎత్తి వారిని సంహరించేవారు. అంతటితో కధ సుఖాంతం అయ్యేది. 
 
ఇప్పుడు ప్రతి మనిషిలో కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే రాక్షసులు మద్య నలిగి విలవిలలాడుతున్నాడు. ఇది కలి ప్రభావం వలన మనిషిని అధోగతి పాలుచేస్తుంది. మనిషిని మనిషిగా సాధకునిగా, మహాజ్ఞానిగా, మహయోగిగా మార్చాలని సత్సంకల్పంతో ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వం, త్రిమూర్తితత్వం ఏకత్వ రూపునిగా దత్తాత్రేయుడుగా అవతరించాడు. అప్పటి నుండి ఈ దత్త అవతారాలు కొనసాగుతూనే వచ్చాయి.
 
శ్రీపాద వల్లభునిగా, మాణిక్యప్రభువుగా, నృసింహసరస్వతిగా, అక్కలకోట స్వామిగా, ఈ కలియుగంలో శ్రీ షిరిడి సాయి బాబాగా మానవ రూపంలో అవతరించి మన అందరి కోర్కెలను, కష్టాలను తీరుస్తున్నాడు. బాబా ఎందరో అవదూతల రూపంలో మనకు దర్శనం ఇచ్చి మనలను కాపాడుతూనే ఉన్నారు. బాబాకు ఎలా దగ్గరగా, ఏం చేయటం వలన దగ్గరవుతామో ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ తన పుస్తకాల ద్వారా మనకు బాబాను గూర్చి తెలియజేసారు.