ఆదివారం, 5 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: గురువారం, 3 ఆగస్టు 2017 (18:34 IST)

కష్టాలు ఎదురయ్యాయని కర్తవ్యాన్ని విడిచిపెట్టకు(సాయి సూక్తులు)

1. నిద్రపోవు సమయమున సాయిని తలుచుకొని, ఆరోజు చేసిన తప్పులకు పశ్చాత్తాపము పొందుము. తిరిగి ఆ తప్పులు చేయకుండునట్లు సాయిని ప్రార్థించుము. 2. తృప్తి, శాంతి, సహనం, ఓర్పు, నేర్పు, నీతి, నిజాయితీ మొదలైన సద్గుణాలతో ఉండువారు శ్రీ శిరిడి సాయి కృపకు పాత్రులు అగు

1. నిద్రపోవు సమయమున సాయిని తలుచుకొని, ఆరోజు చేసిన తప్పులకు పశ్చాత్తాపము పొందుము. తిరిగి ఆ తప్పులు చేయకుండునట్లు సాయిని ప్రార్థించుము.
2. తృప్తి, శాంతి, సహనం, ఓర్పు, నేర్పు, నీతి, నిజాయితీ మొదలైన సద్గుణాలతో ఉండువారు శ్రీ శిరిడి సాయి కృపకు పాత్రులు అగుదురు.
3. కష్టాలు ఎదురయ్యాయని కర్తవ్యాన్ని విడిచిపెట్టకు.
4. జీవితం నీటి బుడగ, కావున ఉన్నత లక్ష్యాన్ని దీక్షతో సాధించు.
5. పనులు అనుకూలంగా జరిగినప్పుడు మన గొప్పతనం అనుకోవడం, వ్యతిరేకంగా జరిగినప్పుడు ఇతరులను నిందించడం, దైవాన్ని దూషించడం మంచిది కాదు.