ఆదివారం, 5 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: బుధవారం, 3 మే 2017 (20:39 IST)

బాబా... నావద్ద ఒక్క పైసా కూడా లేదు....

సాయిబాబా దగ్గర ప్రొఫెసర్ నార్కే అనే ఓ భక్తుడు ఉండేవారు. ఆయన యోగ శాస్త్రాన్ని అభ్యసిస్తూ వుండేవారు. ఒకసారి ప్రొఫెసర్ నార్కే యోగ వాశిష్ట గ్రంథాన్ని చదువుతున్నారు. సాధకుడిని భగవంతుడితో అనుసంధానం చేసే అపురూప గ్రంథం అది. అందులో కొన్ని అధ్యాయాలు చాలా రహస్య

సాయిబాబా దగ్గర ప్రొఫెసర్ నార్కే అనే ఓ భక్తుడు ఉండేవారు. ఆయన యోగ శాస్త్రాన్ని అభ్యసిస్తూ వుండేవారు. ఒకసారి ప్రొఫెసర్ నార్కే యోగ వాశిష్ట గ్రంథాన్ని చదువుతున్నారు. సాధకుడిని భగవంతుడితో అనుసంధానం చేసే అపురూప గ్రంథం అది. అందులో కొన్ని అధ్యాయాలు చాలా రహస్యమైనవి. వాటి గురించి ఒకసారి బాబా నార్కేకు వివరించి... నువ్వు నాకు 15 రూపాయలు గురుదక్షిణ ఇవ్వాలి అని అన్నారు. ఆ సమయంలో నార్కే వద్ద డబ్బు లేదు. 
 
దాంతో ఆయన... బాబా, నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. అది మీకు తెలుసు. అయినా నన్ను మీరు గురుదక్షిణ అడగటంలో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. అప్పుడు బాబా నవ్వుతూ... నువ్వు యోగ వాశిష్టలో కొన్ని అధ్యాయాలు తెలుసుకున్నావు. వాటి నుంచి 15 రూపాయలు నాకు ఇవ్వు అన్నారు. నార్కేకు విషయం బోధపడింది. 
 
యోగా వాశిష్టంలో ఉన్నతమైన యోగాకి వుండాల్సిన 15 లక్షణాలను వివరించడం జరిగింది. ఆ లక్షణాలను తనను ఆచరించమంటున్నారని అర్థం చేసుకున్న నార్కే... వాటిని పాటించి తనను తాను బాబాకు అర్పించుకున్నారు.