సోమవారం, 30 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 22 డిశెంబరు 2017 (21:28 IST)

ఆడవారి జుట్టును పట్టుకుంటే అంతేసంగతులు...

భారతదేశంలో ఆడవారిని దేవతా స్వరూపులుగా భావిస్తారు. ఎందుకంటే స్త్రీలు ఎక్కడైతే గౌరవింపబడతారో అక్కడ సిరిసంపదలు ఉంటాయి. స్త్రీకి అందం జుట్టు. ఐతే వేదకాలం నుంచి స్త్రీలు జుట్టును విరబోసుకోకూడదనే నియమం ఉంది. గుడిలో కూడా జుట్టును విరబోసుకుని ప్రదక్షిణ లాంటి

భారతదేశంలో ఆడవారిని దేవతా స్వరూపులుగా భావిస్తారు. ఎందుకంటే స్త్రీలు ఎక్కడైతే గౌరవింపబడతారో అక్కడ సిరిసంపదలు ఉంటాయి. స్త్రీకి అందం జుట్టు. ఐతే వేదకాలం నుంచి స్త్రీలు జుట్టును విరబోసుకోకూడదనే నియమం ఉంది. గుడిలో కూడా జుట్టును విరబోసుకుని ప్రదక్షిణ లాంటిది పొరపాటున కూడా చేయకూడదు. 
 
జుట్టు ఆడవారి అందాన్ని రెట్టింపు చేస్తుందనడంలో సందేహంలేదు. అయితే ఫ్యాషన్ ముసుగులో ఎవరైతే జుట్టును విరబోసుకుంటున్నారో, వారికి తొందరగా నెగిటివ్ శక్తుల బారినపడతారని చెబుతుంటారు పెద్దలు. ఇక చంద్రుడు ఎప్పుడు నిండుగా ఉంటాడో అప్పుడు మనస్సు తేలికగా ఉంటుంది. అప్పుడు ఇలా విరబోసుకున్నవారిపైన చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుందట. అలాగే కొంతమంది నిద్రపోయేటప్పుడు జుట్టును విరబోసి వదిలేస్తారు. శాస్త్రాల ప్రకారం అలా చేస్తే మహిళపై చెడు ప్రభావం పడుతుంది. 
 
అంతేకాదు అలా చేయడం వల్ల వారి చుట్టూ నెగిటివ్ భావాలు ఏర్పడతాయి. రామాయణంలో సీతారాముల వివాహ సమయంలో సీతాదేవికి ఆమె అమ్మ కొన్ని జాగ్రత్తలు చెప్పారట. ఎప్పుడు కూడా జుట్టును ముడివేసుకుని ఉండు అని. సీతా అపహరణ సమయంలో రావణుడు సీత జుట్టును పట్టుకుని విమానంలోకి తీసుకెళతాడు. అలా చేయడం వల్ల రావణుడి వంశం నిర్వీర్యమైపోయింది. అలాగే భారతంలో కౌరవులు, ద్రౌపది జుట్టుపట్టుకుని లాక్కొస్తారు. దాంతో వారి వంశం నాశనమైంది. అందుకే ఆడవారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటారు పెద్దవారు.