బుధవారం, 6 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2017 (11:56 IST)

గంటల కొద్దీ పనిచేస్తే ప్రయోజనం శూన్యం..

ఏదో ఊరకే కృషి చేయడం, గంటల పాటు శారీరకంగా శ్రమించడం ద్వారా ఒరిగేదేమీ లేదు. గంటల కొద్దీ కృషి చేయడం అనేది మూర్ఖత్వం అని సద్గురు జగ్గీ వాసుదేవ్ (ఈశా పౌండేషన్) అంటున్నారు. ఇంకా సామర్థ్యాన్ని పెంచుకోగలిగితే

ఏదో ఊరకే కృషి చేయడం, గంటల పాటు శారీరకంగా శ్రమించడం ద్వారా ఒరిగేదేమీ లేదు. గంటల కొద్దీ కృషి చేయడం అనేది మూర్ఖత్వం అని సద్గురు జగ్గీ వాసుదేవ్ (ఈశా పౌండేషన్) అంటున్నారు. ఇంకా సామర్థ్యాన్ని పెంచుకోగలిగితేనే లక్ష్యాన్ని చేధించగలమని ఆయన సూచిస్తున్నారు. విజయాన్ని అందుకునేందుకు సద్గురు చెప్పిన కొన్ని సూచనలు మీకోసం...
 
ఊరకే కష్టపడటం అనేది మిమ్మల్ని గమ్యానికి చేర్చదు. సరైన పనిని, సరైన సమయంలో, సరైన చోట చేయడం చాలా ముఖ్యం. ఇవన్నీ జరగడానికి తెలివితేటలు కావాలి. జీవితంలో చేయాల్సిందల్లా.. మీ తెలివితేటలు, దృక్పథాన్ని పెంచుకోవడం. ఇవి చేస్తే జీవితం సుఖమయం అవుతుంది. సామర్థ్యాన్ని పెంచుకుంటే విజయం సులువవుతుంది.
 
సాధారణంగా వ్యాపారాల్లో కేవలం విజయాన్ని మాత్రం కోరుకోకూడదు. వ్యాపారంలో మీ శక్తిసామర్థ్యాలను పెంచుకుంటూ రావాలి. అవగాహన శక్తి పెరిగితే సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యంగా జీవితంపై అవగాహన పెంచుకోవాలి. మీ జీవితం ఎలా వుందో దాన్ని అలానే చూడాలి. మీరు మీ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారా లేదా అనేదే ముఖ్యం. ఎప్పుడూ విజయం గురించి ఆలోచించకుండా మిమ్మల్ని ఒక పరిపూర్ణమైన జీవితంగా ఎలా మార్చుకోవాలని యోచించండి. అప్పుడే విజయం సాకారం అవుతుంది.