1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 16 అక్టోబరు 2017 (13:34 IST)

వేంకటేశ్వరుడికి ఎలాంటి ఆభరణాలు కానుకగా సమర్పించాలో తెలుసా?

చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. సహజంగా ఇళ్లలో కొత్తగా వస్తువులను తీసుకువచ్చినా లేదా కొత్త వస్తువులను ఆభరణాలను తీసుకుంటే వాటిని ముందుగా పసుపు, కుంకుమలతో పూజించి అనంతరం దేవునికి నమస్కారం పెట్టి ధరిస్తారు. ఏదైనా ఆభరణాలను ఇంటికి తీసుకు వచ్చి నేలపై ఉంచక

చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. సహజంగా ఇళ్లలో కొత్తగా వస్తువులను తీసుకువచ్చినా లేదా కొత్త వస్తువులను ఆభరణాలను తీసుకుంటే వాటిని ముందుగా పసుపు, కుంకుమలతో పూజించి అనంతరం దేవునికి నమస్కారం పెట్టి ధరిస్తారు. ఏదైనా ఆభరణాలను ఇంటికి తీసుకు వచ్చి నేలపై ఉంచకూడదు. దీని ద్వారా యోగానికి భంగం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
ఆభరణాలను కొత్తగా తయారు చేయిస్తే లేదా కొనుగోలు చేస్తే దానిని సాధ్యమైనంత మేర వెండి పళ్లెంలో ఉంచి పసుపు, కుంకుమ, పూలతో పూజించి అనంతరం దేవుని ముందు ఉంచి నమస్కరించాలి. కులదైవం, ఆరాధ్య దేవుని ఇష్టార్థం సుమంగుళులకు దానం ఇవ్వాలి. దీంతో మీకు శ్రేయస్సు, కీర్తి లభిస్తుంది. 
 
దేవుని ఉంగరాన్ని ధరించే సమయంలో చిత్రంలో తల భాగం పైకి రావాలి. ఎటువంటి పరిస్థితుల్లో తల భాగం కిందకు రాకుండా చూసుకోవాలి. అలాగే మనుషులు ధరించిన ఆభరణాలను సమర్పించకూడదు.
 
ఇతరుల ఆభరణాలను, ఇతరులను వస్త్రాలను దేవునికి సమర్పించకూడదు. కష్టకాలంలో తాకట్టు పెట్టిన నగలను తిరిగి సొంతం చేసుకున్న వాటిని ఎట్టి పరిస్థితుల్లో దేవునికి అర్పించకూడదు. మనవికాని ఆభరణాలను దేవునికి అర్పించకూడదు. దారిలో లభించిన ఆభరణాలను దేవునికి సమర్పించకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.