గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (13:09 IST)

ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3వ తేదీ నుంచి దసరా నవరాత్రులు

durga maata
అక్టోబర్ 3వ తేదీ నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించే నవరాత్రి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ పండుగలో దుర్గమ్మకు ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలు చేసి భక్తులను ఆకర్షిస్తారు. 
 
ఈ సందర్భంగా దుర్గమ్మను రోజుకో రూపంలో పూజిస్తారు. నవరాత్రుల వేళ భక్తులు దూరదూర ప్రాంతాల నుంచి విజయవాడకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. 
 
అమ్మవారికి పూజలు చేయడం, కుంకుమార్చనలు, హోమాలు చేయడం ద్వారా భక్తులు తమ కోరికలు నెరవేర్చుకుంటారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా నిర్వహించే పూజలు, హోమాలు, అర్చనలు నవరాత్రులలో విశేషమైంది.