శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 9 జనవరి 2017 (16:53 IST)

శ్రీవారి ఆలయంలో స్వల్ప అగ్నిప్రమాదం.. నూనెలో నీళ్లు పడటంతో?

కలియుగ వైకుంఠం.. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోని శ్రీవారి బూందీపోటులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటల్ని ఆర్పివేసే ప్రయత్నం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్ర‌మాద‌స్

కలియుగ వైకుంఠం.. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోని శ్రీవారి బూందీపోటులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటల్ని ఆర్పివేసే ప్రయత్నం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్ర‌మాద‌స్థ‌లికి అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. నూనెలో నీళ్లు పడటమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది. నూనెలో నీళ్లు పడటంతో ఒక్కసారిగా నూనె పొంగి మంటలు చెలరేగాయని అక్క‌డి సిబ్బంది తెలిపారు.
 
ఇకపోతే.. తిరుమల శ్రీవారి ఆలయం  భక్తులతో కిటకిటలాడుతోంది. వైకుంఠ ఏకాదశి, వారాంతం కావడంతో భారీ స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ ఏర్పాట్లు చేసినా భక్తుల సౌకర్యాల్లో, సదుపాయాల్లో లొసుగులు కనిపించాయి. ఇక వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని దివ్య దర్శనం టికెట్ల టోకన్లు ఇవ్వడాన్ని రద్దు చేశారు.