శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 25 జూన్ 2019 (15:46 IST)

తల మీద పుట్టుమచ్చ ఉంటే ఏ పదవి వరిస్తుంది?

ప్రపంచం ఇప్పుడు సాంకేతిక యుగంలో ముందుకు దూసుకుపోతోంది. కానీ, శాస్త్రాల ప్రకారం పరిశోధనలో భారతదేశానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. జీవనవిధానానికి సంబంధించిన ప్రతి అంశాన్ని మన పండితులు కొన్ని వందల ఏళ్ళ క్రితం నుండే విశ్లేషించడం జరిగింది. సాధారణంగా ప్రతి మనిషికి పుట్టుమచ్చ ఉండటం సహజం అసలీ పుట్టు మచ్చలు ఎలా ఏర్పడతాయి, వాటి వల్ల ప్రయోజనాలు ఏంటి ప్రతిఫలాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనం జన్మించినప్పుడు ఉండే నల్లటి మచ్చలను పుట్టుమచ్చలు అంటారు.
 
అయితే ఇవి ఉండే ప్రదేశాన్ని బట్టి మన వ్యక్తిత్వం ఏంటనేది చెప్పవచ్చు అంటున్నారు పండితులు. జీవితం యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుందో మీ శరీరం మీద ఉన్న పుట్టుమచ్చల ఆధారంగా తెలుసుకోవచ్చు అంటున్నారు. ఇక జ్యోతిష్కులు చెప్పే దాన్నిబట్టి శరీరంపై ఉండే పుట్టు మచ్చ కూడా మన జాతకాన్ని నిర్ణయిస్తాయని అంటున్నారు, దీనికి శాస్త్రీయం ఉందని కూడా వారి గట్టి విశ్వాసం. 
 
మరి తల మీద పుట్టుమచ్చ ఉంటే ఏ విధమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తల మీద పుట్టుమచ్చ ఉంటే ఏ పదవి చేపట్టినా తిరుగుండదు, రాజకీయాల అవగాహన చాలా ఉంటుంది. వీరికి డబ్బు విషయంలో కొదవ వుండదు. తెలివితో వ్యాపార రంగంలో రాణిస్తారు. ఒకవేళ తల మీద ఎడమ వైపు పుట్టుమచ్చ ఉంటే సంపాదన మీద ఆసక్తి అనేది ఉండదు. 
 
వీరికి ఇతరులకు సేవ చేయాలనే ఆశ ఎక్కువగా ఉంటుంది. ఇతరులకు మంచి చేయాలనే మంచి మనసు ఉంటుంది. తల మీద ఎడమ వైపు పుట్టుమచ్చ ఉన్న వారు ఎప్పుడూ సమాజం కోసం ఆలోచిస్తూ ఉంటారు, ఒకే చోట ఎప్పుడూ స్థిరంగా ఉండటానికి ఇష్టపడరు. సన్యాసం పైన వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. తల వెనుక భాగంలో పుట్టు మచ్చ ఉన్నట్లైతే డబ్బు సంపాదించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. 
 
వీరి దాంపత్య జీవితం బాగుంటుంది. వీరి గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటారు. తల ముందు భాగంలో కనుక పుట్టు మచ్చ ఉన్నట్లైతే మీరు చెప్పినట్లు మిగతావాళ్ళు చేయాలనుకుంటారు, వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. 
 
ఇక పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం తలకి కుడివైపున పుట్టుమచ్చ ఉన్న వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని, తలకి ఎడమవైపు పుట్టుమచ్చ ఉన్న వారు సంసార జీవితం కంటే సన్యాసి జీవితానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పవచ్చు.