NRI Donor: రూ.1.40కోట్లకు పైగా విరాళం ఇచ్చిన ఎన్నారై దాత
అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ఎన్నారై దాత శ్రీ ఆనంద్ మోహన్ భాగవతుల గురువారం టిటిడిలోని వివిధ ట్రస్టులకు రూ.1.40కోట్లకు పైగా విరాళం ఇచ్చారు. దీనికి సంబంధించిన డిడిలను ఆయన తిరుమలలోని చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడుకు అందజేశారు.
విరాళాల మొత్తంలో ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1,00,01,116, ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.10,01,116, ఎస్వీ విద్యాదాన ట్రస్ట్‌కు రూ.10,01,116, ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్ట్‌కు రూ.10,01,116, ఎస్వీ సర్వశ్రేయస్ ట్రస్ట్‌కు రూ.10,01,116 ఉన్నాయి. టిటిడిలోని వివిధ ట్రస్ట్‌లకు విరాళాలు అందించిన ఎన్నారై దాతను టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు అభినందించారు.
మరోవైపు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు మంగళవారం వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరిగాయి.