శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : సోమవారం, 28 నవంబరు 2016 (11:14 IST)

శ్రీవారి ఆలయంలో మరో ప్రయోగం... వెండి వాకిలి నుంచే మూడు క్యూలైన్లు

శ్రీవారిని ఎక్కువ మంది భక్తులు ప్రశాంతంగా దర్శించుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా మరో ప్రయత్నం చేసింది. మూడు క్యూలైన్ల విధానాన్ని మరింత విస్తృతం చేసింది. గతంలో ఒకే

శ్రీవారిని ఎక్కువ మంది భక్తులు ప్రశాంతంగా దర్శించుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా మరో ప్రయత్నం చేసింది. మూడు క్యూలైన్ల విధానాన్ని మరింత విస్తృతం చేసింది. గతంలో ఒకే క్యూలైన్‌ వ్యవస్థ ఉన్నప్పుడు స్వామివారిని దర్శించుకునే సమయంలో భక్తుల మధ్య తోపులాటలు జరిగేవి. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఒకింత ఇబ్బందికి గురయ్యేవారు. ఎం.జి.గోపాల్‌ ఈఓగా ఉన్న సమయంలో బంగారు వాకిలి లోపల మూడు క్యూలైన్ల పద్ధతి ప్రవేశపెట్టారు. బంగారు వాకిలి లోపలికి ప్రవేశించిన తర్వాత భక్తులు మూడు వరుసలుగా విడిపోవడం వల్ల తోపులాటలు చాలా వరకు తప్పిపోయాయి. ఈ మూడు క్యూలైన్ల పద్ధతి వల్ల స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య బాగా పెరిగింది.
 
వెండివాకిలి దాటి బంగారు వాకిలిలోకి ప్రవేశించే సమయంలో తొక్కిసలాట యథాతథంగా కొనసాగుతుండగా దీనిపై డయల్‌ తితిదే బంగారు వాకిలి లోపల ఉన్న క్యూలైన్లను బయట దాకా అంటే వెండి వాకిలి దాటగానే వచ్చే వరదరాజస్వామి ఆలయం దాకా పొడిగించారు. అంటే వెండివాకిలి నుంచి వచ్చే భక్తులు అక్కడే మూడు వరుసలుగా విడిపోతారు. గతంలో వెండివాకిలి దాటిన తర్వాత బంగారు వాకిలిలోకి ప్రవేశించడానికి కాస్త గుమిగూడినట్లు ఉండేవారు. దీని వల్ల బంగారు వాకిలిలోకి ప్రవేశించడానికి తోపులాటలు జరిగేవి. మూడు క్యూలైన్లను వరదరాజస్వామి ఆలయం దాకా పొడిగించడంతో ఆ ఇబ్బంది కూడా తప్పింది.