శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 5 అక్టోబరు 2018 (11:09 IST)

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు... 17న స్వర్ణ రథోత్సవం

తిరుమల తిరుపతి దేవస్థానం ఈనెల 10వ తేదీ నుంచి శ్రీవారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 17వ తేదీన శ్రీవారికి స్వర్ణరథోత్సవం జరుగనుంది.

తిరుమల తిరుపతి దేవస్థానం ఈనెల 10వ తేదీ నుంచి శ్రీవారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 17వ తేదీన శ్రీవారికి స్వర్ణరథోత్సవం జరుగనుంది. ఈ బ్రహ్మోత్సవాలకు ఈనెల 9వ తేదీన అంకురార్పణ చేస్తారు.
 
చాంద్రమానం ప్రకారం మూడేళ్లకోసారి అధికమాసం వస్తుంది. ఆ సంవత్సరం భాద్రపదంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా సమయంలో నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. వీటిని పదో తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తారు. 
 
రెండోసారి జరిగే నవరాత్రి ఉత్సవాల్లో ధ్వజారోహణం, సీఎం పట్టువస్త్రాల సమర్పణ, స్నపన తిరుమంజనం, మహారథోత్సవం, ధ్వజావరోహణం ఉండవు. ఈ ఉత్సవాల్లో మాత్రమే నిర్వహించే పుష్పక విమాన వాహనసేవను ఈనెల 15న నిర్వహిస్తారు. 14న గరుడసేవ, 17న స్వర్ణ రథోత్సవం, 18న ఉదయం 6 గంటలకు చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి.