ఆదివారం, 24 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. మధుర జ్ఞాపకాలు
Written By
Last Updated : శుక్రవారం, 9 నవంబరు 2018 (09:56 IST)

పడక గదిలో తలగడలతో యుద్ధం చేసుకోండి...

లవ్.. ప్యార్.. ప్రేమ.. వీటిలోని అక్షరాలు వేరైనా అర్థం ఒకటే. ఈ పదం వింటే అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతారు. అలాంటి ప్రేమకు పెళ్లి స్పీడ్ బ్రేకర్ వంటిదని అనేక మంది చమత్కరిస్తుంటారు. 
 
అయితే పెళ్లి తర్వాత కూడా జీవిత భాగస్వామితో జీవితంలో చోటుచేసుకున్న తొలినాటి ప్రేమానుభూతులను నెమరు వేసుకునేందుకు, మళ్లీ అలనాటి అనుభూతులను పంచుకునేందుకు కొన్నిపాటి చిట్కాలు పాటిస్తే చాలు... అవేంటో ఓసారి పరిశీలిద్ధాం. 
 
పెళ్లయిన కొత్తల్లోనే కాకుండా, పిల్లలు పుట్టిన తర్వాత కూడా జీవిత భాగస్వామికి ప్రతి రోజూ మల్లెపూలు తెచ్చి ప్రేమతో చేతికివ్వండి. అలాగే, మీ శ్రీమతికి నచ్చే బహుమతులు, ఆభరణాలు, సుగంధ ద్రవ్యాలు, చీరలు తదితరాలు కొనుగోలు చేయండి. ఇందుకోసం కాస్త జేబుకు చిల్లు పెట్టుకోండి. 
 
ముఖ్యంగా, పడక గదిలో ఉండే బెడ్ మంచంపై హృదయం ఆకారంలో ఉండే దిండ్లు (తలగడలు)కు కాస్త చోటుకల్పించండి. వీలుపడితే ఆ దిండ్లపై మీ పేర్లను ఎంబ్రాయిడరీ చేయించుకోండి. 
 
శృంగారభరిత భావనలు వెల్లివిరిసేందుకు అప్పుడప్పుడు తలగడలతో యుద్ధం చేసుకోండి. అలసిన వేళ ఒకరి ఒడిలో మరొకరు సేద తీరేవేళ పొంగిపొరలే అనిర్వచనీయ ప్రేమానుభూతులు కలకాలం గుర్తుండిపోతాయి.