గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. మధుర జ్ఞాపకాలు
Written By
Last Modified: సోమవారం, 23 సెప్టెంబరు 2019 (11:38 IST)

మీ ప్రేయసికి ఎప్పుడైనా ప్రేమలేఖ రాశారా... ?

మీ ప్రేయసికి ఎప్పుడైనా ప్రేమలేఖ రాశారా... ? అని అడిగితే ఈ కాలంలో ప్రేమలేఖ ఏంటండీ బాబూ అని తేలిగ్గా తీసిపారేస్తుంటారు. నిజమే ఆధునికయుగంలో సెల్‌ఫోన్‌లు ఇంటర్నెట్‌లు వచ్చాక అనుకున్న వెంటనే ప్రియురాలు లేదా ప్రియుడితో మాట్లాడేస్తుంటే ఇక లేఖలు రాయాల్సిన అవసరం ఏముంది అన్నది ప్రస్తుతం యువత భావన. 
 
కానీ రోజులు ఎంత మారినా, ప్రపంచం ఎంత ఆధునికమైనా ప్రేమ మాత్రం మారడం లేదు కదా మరి ప్రేమ భావాన్ని తెలిపే ప్రేమలేఖల సంస్కృతిని మాత్రం మనం మార్చేస్తే ఏం బావుంటుంది. అందుకే ప్రేమలో పడ్డ ప్రతివారు అప్పుడప్పుడూ ప్రేమలేఖలు రాస్తేనే వారు ప్రేమలో పరిపూర్ణంగా మునిగినట్టు లెక్క. 
 
అయితే కలం పట్టి కాగితంపై నాలుగు పదాలు రాద్దామంటే వస్తే కదా అంటారా... అయితే ఎవరూ లేని ఓ ఒంటరి ప్రదేశంలో కాసేపు అలా కూర్చోండి. మీరూ మీ ప్రేయసి సరదాగా గడిపిన క్షణాలను కాసేపు గుర్తు చేసుకోండి. ఆ క్షణంలో మీరు అను భవించిన సంతోషాన్ని, మీ ప్రేయసి మీపై చూపించిన ప్రేమ భావానికి అక్షర రూపం ఇచ్చే ప్రయత్నం చేయండి.