గురువారం, 21 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. సంక్రాంతి
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 జనవరి 2024 (21:07 IST)

మకర సంక్రాంతి: అన్నదానం, బెల్లాన్ని దానం చేస్తే ఏంటి ఫలితం?

మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన వెంటనే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి సందర్భంగా నదీస్నానం లేదా ఇంటి నీటిలో గంగాజలంతో స్నానం చేయడం ముఖ్యం. అలాగే సూర్యుడిని స్తుతించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. మకర సంక్రాంతి రోజున బెల్లం దానం చేయాలి. 
 
ఈ దానం ద్వారా శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇంకా సూర్య, బృహస్పతి దోషాలను తొలగించుకోవచ్చు. మకర సంక్రాంతి రోజున బెల్లం, నల్ల నువ్వుల లడ్డూలను దానం చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. మకర సంక్రాంతి రోజున పేదలకు శక్తికి తగిన సాయం చేయాలి. దుప్పట్లు, వెచ్చని వస్త్రాలు దానం చేయాలి.

ఇలా చేస్తే మీ జాతకంలో రాహు గ్రహానికి సంబంధించిన దోషం తొలగిపోతుంది. మకర సంక్రాంతి రోజున నల్ల పప్పు, బియ్యంతో చేసిన కిచిడిని దానం చేస్తే శని, గురు, బుధ గ్రహాలకు సంబంధించిన దోషాలు తొలగిపోతాయి. మకర సంక్రాంతి రోజున అన్నదానం చేయడం వల్ల చంద్రదోషం కూడా తొలగిపోతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.