శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. పర్యాటక రంగం
  3. సముద్ర తీరాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 5 జులై 2024 (21:53 IST)

భారతీయుల కోసం బహుళ వీసా అవకాశాలను ప్రకటించిన సౌదీ

elephant rock
తమ దేశంలో వైవిధ్యమైన గమ్యస్థానాలకు సులభంగా చేరుకోవడం సాధ్యం చేస్తూ అనేక రకాల పర్యాటక వీసా అవకాశాలను భారతీయ యాత్రికులను సౌదీ అందిస్తుంది. స్టాప్‌ఓవర్ వీసా, ఈ-వీసా సేవలు, వీసా-ఆన్-అరైవల్‌తో, రియాద్ నగర అందాలు, జెడ్డా యొక్క సాంస్కృతిక గొప్పతనం, ఎర్ర సముద్రం రహస్య సంపద, అల్ ఉలా యొక్క పురాతన అద్భుతాలను అన్వేషించడానికి సౌదీ ఆహ్వానాన్ని అందిస్తోంది. కొత్త మార్గదర్శకాలు, వీసా ఎంపికలు అనేక రకాల ప్రయాణ అవసరాలను తీరుస్తాయి, దేశాన్ని అన్వేషించడానికి ఎక్కువ మంది ప్రయాణికులను ప్రోత్సహిస్తాయి.
 
ప్రస్తుతం, ముంబై, ఢిల్లీ, కొచ్చిన్, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగుళూరు, లక్నో, కోల్‌కతా, కాలికట్‌లలో 10 వీసా ఫెసిలిటేషన్ కేంద్రాలు ఉన్నాయి, అదనపు నగరాల్లో మరిన్ని ప్రత్యేక కేంద్రాలను జోడించే యోచనలో సౌదీ వుంది. ఇది సౌదీ విజన్ 2030కి అనుగుణంగా ఉంది, 2030 నాటికి 7.5 మిలియన్ల మంది భారతీయ ప్రయాణీకులను స్వాగతించే లక్ష్యంతో నంబర్ 1 సోర్స్ మార్కెట్‌గా భారతదేశ సామర్థ్యాన్ని ఉపయోగించుకునే లక్ష్యంతో ఇది కృషి చేస్తుంది. 2024 చివరి నాటికి, సౌదీ సందర్శకుల సంఖ్యను 2.2మిలియన్కి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 
 
స్టాప్‌ఓవర్ వీసా
భారతీయ ప్రయాణికులు ఇప్పుడు స్టాప్‌ఓవర్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, ఇది 96 గంటల వరకు చెల్లుబాటు అవుతుంది. అడ్మినిస్ట్రేషన్, బీమా సేవలకు నామమాత్రపు రుసుముతో సౌదీయా ఎయిర్‌లైన్ వెబ్‌సైట్‌లో 90 రోజుల ముందుగానే పొందవచ్చు.
 
ఈ- వీసా 
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ లేదా ఏదైనా స్కెంజెన్ దేశం నుండి చెల్లుబాటు అయ్యే పర్యాటక లేదా వ్యాపార వీసాను కలిగి ఉన్న భారతీయులు, ప్రవేశానికి సంబంధించిన స్టాంపు రుజువుతో ఈ-వీసా పొందవచ్చు. ఈ దేశాలలో శాశ్వత నివాసితులు లేదా జిసిసి దేశం నుండి సౌదీలోకి ప్రవేశించిన తేదీ తరువాత మూడు నెలల కనీస చెల్లుబాటు అయ్యే నివాస వీసాను కలిగి ఉన్న వ్యక్తులు కూడా అర్హులు. ఈ వీసాను అధికారిక పోర్టల్ ద్వారా బయలుదేరే ముందు పొందవచ్చు.
 
వీసా ఆన్ అరైవల్
యుఎస్, యుకె, లేదా స్కెంజెన్ దేశాల నుండి చెల్లుబాటు అయ్యే టూరిస్ట్ లేదా వ్యాపార వీసా కలిగి ఉన్న ప్రయాణికులు, ఎంట్రీ స్టాంపులతో సౌదీ అంతర్జాతీయ విమానాశ్రయాలకు చేరుకున్న తర్వాత వీసాను కూడా పొందవచ్చు. ఈ దేశాల్లో శాశ్వత నివాసం ఉన్నవారు సౌదీ విమానాశ్రయాల్లోని సెల్ఫ్ సర్వీస్ కియోస్క్‌లు లేదా పాస్‌పోర్ట్ నియంత్రణ కార్యాలయాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
 
పైన పేర్కొన్న ప్రమాణాల ప్రకారం అర్హత లేని వారు భారతదేశంలోని తషీర్ కేంద్రాల ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో పత్రాల తయారీ, అపాయింట్‌మెంట్ బుకింగ్, దరఖాస్తు సమర్పణ, బయోమెట్రిక్ నమోదు, పాస్‌పోర్ట్ సేకరణ ఉంటాయి. ఈ వీసా ఎంపికలన్నీ ఉమ్రా చేయాలనుకునే వారికి చెల్లుబాటు అవుతాయి.
 
అధికారిక ప్లాట్‌ఫారమ్, visa.mofa.gov.sa వీసా దరఖాస్తులపై మరింత సమాచారాన్ని పొందవచ్చు. పర్యాటక ఆఫర్‌లు, ప్రయాణ మార్గదర్శకాలను అన్వేషించడానికి, VisitSaudi లాగిన్ చేయవచ్చు. స్టాప్‌ఓవర్ వీసా, ఈ- వీసా, వీసా ఆన్ అరైవల్ షరతులతో కూడిన అర్హతతో వస్తాయి, ప్రయాణికులందరికీ ఇవి చెల్లుబాటు కావు.