శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 జనవరి 2024 (17:21 IST)

భారత ఈక్విటీ మార్కెట్లకు బ్లాక్ డే నేడు.. కుప్పకూలిన సూచీలు

stock market
భారత ఈక్విటీ మార్కెట్లకు బ్లాక్ డే నేడు. ఈ ఏడాది తొలిసారిగా బాంబే స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఆసియా మార్కెట్లలో ప్రతికూలతకు తోడు వడ్డీ రేట్లకు సంబంధించి ఆందోళనలు, దేశీయంగా దిగ్గజ హెచ్‌డీఎఫ్‌సీ షేర్లలో భారీ అమ్మకాలు మార్కెట్ల పతనానికి కారణమయ్యాయి. 
 
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,628 పాయింట్లు కుప్పకూలి 71,500 వద్ద, నిఫ్టీ 460 పాయింట్లు క్షీణించి 21,571 వద్ద ముగిశాయి. 
 
నిఫ్టీ50 ఇండెక్స్‌లో, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ అత్యధికంగా 1.31 శాతం లాభాలతో ట్రేడవుతుండగా, ఎస్‌బిఐ లైఫ్, ఎల్‌టిఐ మైండ్‌ట్రీ, టిసిఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రాతో సహా ఇతర కొన్ని స్టాక్‌లు స్వల్ప లాభాలతో ట్రేడయ్యాయి.
 
లాగార్డ్ విభాగంలో, సంస్థ డిసెంబర్ త్రైమాసిక ఫలితాల తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దాదాపు 8.44 శాతం పడిపోయింది. టాటా స్టీల్ 4.08 శాతం పడిపోయింది. ఇండెక్స్‌లో కోటక్ బ్యాంక్, హిందాల్కో, యాక్సిస్ బ్యాంక్ 3 శాతానికి పైగా నష్టపోయాయి.