శుక్రవారం, 9 జనవరి 2026
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By PNR
Last Updated : మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (19:36 IST)

భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్ సూచీ

బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ మంగళవారం ట్రేడింగ్‌లో కూడా భారీ నష్టాలతో ముగిసింది. ప్రధాన సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్ 324 పాయింట్లు కోల్పోయి 26,493 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 109 పాయింట్లు కోల్పోయి 7,933 వద్ద స్థిరపడ్డాయి. 
 
ఈ ట్రేడింగ్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హిందుస్థాన్ యూనీలీవర్, ఐటీసీ లిమిటెడ్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా ఇండియా తదితర కంపెనీల షేర్లు లాభాలను అర్జించగా, టాటా పవర్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఎల్ అండ్ టీ తదితర షేర్లు నష్టాలను చవిచూశాయి.