భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

pnr| Last Updated: సోమవారం, 21 మార్చి 2016 (19:07 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ భారీ లాభాలతో ముగిసింది. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ సూచీ 332 పాయింట్లు లాభపడి 25,285 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 99 పాయింట్లు లాభపడి 7,704 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.66.49 వద్ద కొనసాగుతోంది.

అలాగే, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో.. అంబుజా సిమెంట్‌ సంస్థ షేర్లు అత్యధికంగా 4.41 శాతం లాభపడి రూ.231.85 వద్ద ముగిశాయి. వీటితోపాటు అల్ట్రాటెక్‌ సిమెంట్‌, బాష్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌, ఎస్‌బీఐ సంస్థల షేర్లు లాభపడ్డాయి. అలాగే ఏషియన్‌ పెయింట్‌ సంస్థ షేర్లు అత్యధికంగా 2.26శాతం నష్టపోయి రూ.855.60 వద్ద ముగిశాయి. వీటితోపాటు లుపిన్‌, బీహెచ్‌ఈఎల్‌, కోల్‌ ఇండియా గెయిల్‌ సంస్థల షేర్లు నష్టపోయాయి.దీనిపై మరింత చదవండి :