బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 జనవరి 2021 (10:14 IST)

ఫుట్‌బాల్ ప్రముఖ క్రీడాకారులకు కరోనా పాజిటివ్

Football
ఫుట్‌బాల్ ప్రముఖ క్రీడాకారులు కల్హానోగ్లు, హెర్నాండెజ్‌లకు జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ఎలాంటి లక్షణాలు లేకున్నా ఇద్దరు క్రీడాకారులకు కరోనా సోకిందని ఏసీమిలన్ జట్టు తెలిపింది. ఏసీ మిలన్ జట్టు సభ్యులందరికీ కరోనా పరీక్షలు చేయగా వారిలో కల్హానోగ్లు, హెర్నాండెజ్‌లకు కరోనా పాజిటివ్ అని తేలింది. జట్టులోని మిగతా సభ్యులకు కరోనా నెగిటివ్ అని తేలింది. 
 
కరోనా సోకిన కల్హానోగ్లు, హెర్నాండెజ్‌లను ఐసోలేషన్ కు తరలించి వారిని వైద్యులు చికిత్స చేస్తున్నారని ఫుట్ బాల్ క్లబ్ తెలిపింది. దిగ్గజ క్రీడాకారులు కరోనా బారిన పడటంతో వారు జట్టులో ఆడటం లేదని ఫుట్ బాల్ క్లబ్ మేనేజరు స్టెఫానో పియోలి చెప్పారు.