శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి

ISL 2020-21_ బెంగళూరు, నార్త్‌ఈస్ట్‌ల మ్యాచ్.. డ్రాగానే ముగిసింది..

NorthEast United, Bengaluru
బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్త్‌ఈస్ట్ యునైటెడ్ టీమ్ మరో డ్రాను ఖాతాలో వేసుకుంది. బెంగళూరు, నార్త్‌ఈస్ట్‌ల మధ్య జరిగిన ఈ మ్యాచ్  ఆరంభంలో నార్త్‌ఈస్ట్ చెలరేగినా... మ్యాచ్ ముగింపులో ఈ జట్టు విఫలమైంది. ఫలితంగా నార్త్‌ఈస్ట్ యునైటెడ్ టీమ్ మరో డ్రాను ఖాతాలో వేసుకుంది. మంగళవారం లీగ్ మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకుంది. నార్త్‌ఈస్ట్ తరఫున లూయిస్ మకాడో (27వ నిమిషం) గోల్ చేయగా, రాహుల్ బేకీ (50వ నిమిషం) బెంగళూరుకు గోల్ అందించాడు.
 
ఈ సీజన్‌లో నార్త్‌ఈస్ట్‌కు ఇది ఏడో డ్రా కావడం విశేషం. నాలుగు వరుస పరాజయాల తర్వాత బెంగళూరు డ్రాతో బయటపడింది. ఇరు జట్లు మూడు మార్పులతో బరిలోకి దిగాయి. ఆరంభంలో బెంగళూరు పటిష్టమైన డిఫెన్స్‌తో ముందుకెళ్లినా.. గోల్స్ చేసే అవకాశాలను సృష్టించుకోలేకపోయింది. 
 
అయితే ఫీల్డ్‌లో చురుకుగా కదిలిన మకాడో బ్రిలియంట్ స్ట్రయిక్స్‌తో ఆకట్టుకున్నాడు. ఫెడ్రిక్ గలెగో ఇచ్చిన పాస్‌ను నేర్పుగా గోల్‌పోస్ట్‌లోకి పంపి నార్త్‌ఈస్ట్‌కు 1-0 లీడ్ అందించాడు. సెకండ్ హాఫ్‌లో పదును పెంచిన బెంగళూరు కౌంటర్ అటాకింగ్‌తో అదరగొట్టింది. ఈ క్రమంలో రాహుల్ కొట్టిన లాంగ్ పాస్ గోల్‌గా మారడంతో స్కోర్ సమమైంది.