అభిమానుల అశ్రునయనాల మధ్య మారడోనా అంత్యక్రియలు పూర్తి
అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం, బుధవారం రాత్రి అనారోగ్యం కారణంగా కన్నుమూసిన డిగో మారడోనా అంత్యక్రియలు ప్రజలు, అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. ఆయన పార్ధివ దేహాన్ని రాజధాని బ్యూనస్ ఎయిర్స్ శివార్లలోని బెల్లా విస్తా శ్మశాన వాటికలో ఖననం చేశారు.
ఈ కార్యక్రమంలో కుటుంబీకులు, సన్నిహితులు మాత్రమే పాల్గొన్నప్పటికీ, అంతకు ముందు జరిగిన అంతిమ యాత్రలో లక్షలాది మంది పాల్గొని తమ అభిమాన ఆటగాడికి శ్రద్ధాంజలి ఘటించారు.
సాకర్ ఆల్ టైం గ్రేట్ ఆటగాడు, అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనా నవంబర్ ఆరంభంలో మెదడులో రక్తనాళాలు మూసుకుపోవడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. సాకర్ ప్రపంచంలో ఆల్ టైం గ్రేట్ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న మారడోనా 1986 ప్రపంచకప్‌లో అర్జెంటీనా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆ వరల్డ్ కప్ అర్జెంటీనా సాధించింది. డిగో మారడోనా సాకర్ ప్రపంచపు మేధావి మాత్రమే కాదు, అనేక వివాదాలకు కేంద్ర బిందువు కూడా.
ప్రపంచకప్ గెలిచిన సంబరంలోనే కాదు, డ్రగ్స్‌తో అతన్ని పతనాన్ని కూడా ప్రపంచం చూసింది. సొంత దేశం అర్జెంటీనా నుంచి ఇటలీ వరకు అతని విజయాలు విస్తరించాయి. డిగో మారడోనా అంత్యక్రియలు ప్రజలు, అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. ఈ కార్యక్రమంలో కుటుంబీకులు, సన్నిహితులు మాత్రమే పాల్గొన్నప్పటికీ అంతకు ముందు అశేష అభిమానులు ఆయనుకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన ప్రజలందరి మనసులోనూ తరతరాలు చిరస్థాయిగా ఉంటారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.