ఆస్ట్రేలియన్ ఓపెన్: సింగిల్స్‌ ఫైనల్లోకి నోవాక్ జకోవిచ్..

Novak Djokovic
సెల్వి| Last Updated: గురువారం, 18 ఫిబ్రవరి 2021 (17:02 IST)
Novak Djokovic
ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్‌ పురుషుల ఫైనల్లో నోవాక్ జోకోవిచ్ ప్రవేశించాడు. ఇవాళ జరిగిన సెమీస్ మ్యాచ్‌లో జకోవిచ్ 6-3, 6-4, 6-2 స్కోర్‌తో అలవోకగా కరత్సేవ్‌పై గెలుపొందాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి జకోవిచ్ ప్రవేశించడం ఇది తొమ్మిదోసారి.

ఇక గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు వెళ్లడం అతనికి 28వ సారి అవుతుంది. ఇవాళ్టి సెమీస్ మ్యాచ్ గంటా 53 నిమిషాల పాటు కొనసాగింది. రాడ్ లావెర్ ఎరినా మైదానంలో జకోవిచ్ తన ప్రతాపాన్ని చూపించాడు.

వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 114వ స్థానంలో ఉన్న అస్లన్ కరత్సేవ్‌.. నేటి మ్యాచ్‌తో టాప్ 50లోకి ప్రవేశించనున్నాడు. శుక్రవారం మెద్వదేవ్‌, స్టెఫానోస్ సిత్‌సిపాస్ మధ్య జరిగే మ్యాచ్ విజేతతో జోకోవిచ్ ఫైనల్లో తలపడుతాడు.దీనిపై మరింత చదవండి :