ఆదివారం, 5 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 27 నవంబరు 2018 (11:11 IST)

పశ్చిమ బెంగాల్ డబుల్స్ నెం.1 ర్యాంకర్.. త్రినాంకుర్ మృతి

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు త్రినాంకుర్ నాగ్ (26) దుర్మరణం పాలయ్యాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర డబుల్స్ నెం.1 ర్యాంకర్ అయిన నాగ్ విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయాడు. 
 
స్పోర్ట్స్ కోటాలో రైల్వే శాఖలో ఉద్యోగిగా ఉన్న త్రినాంకుర్, షెడ్లో పనిచేస్తున్న తరుణంలో విద్యుత్ షాక్‌తో మరణించాడు. హై టెన్షన్ కరెంట్ తీగలు తగలడంతో.. ఆయన కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. 
 
ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోవడంతో మృతి చెందాడు. చిన్ననాటి నుంచి బ్యాడ్మింటన్ పై ఆసక్తి పెంచుతున్న త్రినాంకుర్, పలు టోర్నీల్లో విజేతగా నిలిచాడు. త్రినాంకుర్ మృతి పట్ల పశ్చిమ బెంగాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది.