బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 జులై 2021 (08:25 IST)

వయసు మీదపడుతున్నా సత్తాతగ్గని రోజర్ ఫెదరర్.. థర్డ్ రౌండ్‌లోకి ఎంట్రీ

వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో పలు సంచలన విజయాలు సాధించి, మరో గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలవడమే లక్ష్యంగా ఈ దఫా బరిలోకి దిగిన స్విస్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్, తనలో ఎంతమాత్రమూ సత్తా తగ్గలేదని మరోమారు నిరూపించాడు. మూడవ రౌండ్‌లోకి ప్రవేశించాడు. 
 
ఈ టోర్నీలో ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన ఫెదరర్, రెండో రౌండ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన రిచర్డ్ గ్యాస్కట్‌తో తలపడి గెలిచాడు. మూడు వరుస సెట్లలో 7-6(1), 6-1, 6-4 తేడాతో ఫెదరర్ గెలవడం గమనార్హం.
 
మరో మ్యాచ్‌లో రెండో సీడ్ మెద్వదేవ్, స్పెయిన్‌కు చెందిన అల్కర్జ్ గార్ఫియాపై పోటీ పడి, 6-4, 6-1, 6-2 తేడాతో గెలిచాడు. మహిళల సింగిల్స్ విషయానికి వస్తే, ఇప్పటికే పలువురు టాప్ సీడ్స్ వైదొలగగా, మూడో సీడ్‌గా బరిలోకి దిగిన స్వితోలినా కూడా అదే దారిలో నడిచింది. 
 
పోలెండ్‌కు చెందిన మగ్దా లిన్నెట్టితో పోటీ పడిన ఆమె 3-6, 4-6 తేడాతో ఓటమి పాలైంది. బ్లింకోవాపై బార్టీ 6-4, 6-3 తేడాతో గెలువగా, 8వ సీడ్ కరోలినా ప్లిస్కోవా 6-2, 6-2 తేడాతో డోనా వికిక్‌పై విజయం సాధించింది.