బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 జనవరి 2021 (19:23 IST)

ISL Special: జంషెడ్‌పూర్‌పై నార్త్ ఈస్ట్ యునైటెడ్ విజయం

ISL
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) 2020-21‌లో భాగంగా ఆదివారం సాయంత్రం జంషెడ్‌పూర్‌తో జరిగిన మ్యాచులో నార్త్ ఈస్ట్ యునైటెడ్ 2-1తో విజయాన్ని అందుకుంది. ఏడు మ్యాచుల తర్వాత నార్త్ ఈస్ట్ ఓ విజయాన్ని అందుకుంది. చివరి ఐదు మ్యాచులలో ఓ విజయం, రెండు ఓటములు, రెండు డ్రాలను ఎదురొంది. నార్త్ ఈస్ట్ 12 మ్యాచులలో 3 విజయాలతో 15 పాయింట్లు ఖాతాలో వేసుకుని పత్రికలో ఐదవ స్థానంలో ఉంది.
 
36వ నిమిషంలో అశుతోష్ మెహతా గోల్ చేసి నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. దీంతో తొలి అర్ధ భాగాన్ని నార్త్ ఈస్ట్ 1-0తో ముగించింది. 61 నిమిషంలో బ్రౌన్ మరో గోల్ చేసి నార్త్ ఈస్ట్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. 89వ నిమిషంలో జంషెడ్‌పూర్ ఆటగాడు పీటర్ హార్ట్లీ గోల్ చేసి నార్త్ ఈస్ట్ ఆధిక్యాన్ని 1-2కి తగ్గించాడు. ఆపై మరో గోల్ నమోదుకాకపోవడంతో నార్త్ ఈస్ట్ విజయాన్ని అందుకుంది.