ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 నవంబరు 2021 (10:50 IST)

మెస్సీ అదుర్స్... ఏకంగా ఏడోసారి ఆ అవార్డు కైవసం..

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ అరుదైన ఘనత సాధించాడు. బాలన్ డి ఓర్ అవార్డును ఏకంగా ఏడోసారి అందుకుని రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది జరిగిన కోపా అమెరికా కప్ ఫైనల్‌లో బ్రెజిల్‌ను ఓడించిన అర్జెంటీనా కప్పును ఎగరేసుకుపోయింది. అర్జెంటీనా ఓ మెగా టైటిల్‌ను అందుకోవడం 28 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. దేశానికి కప్పు అందించిపెట్టిన మెస్సీపై ప్రశంసలు వెల్లువెత్తాయి.
 
ఇప్పటివరకు 2009, 2010, 2011, 2012, 2015, 2019 సంవత్సరాల్లోనూ బాలన్ డి ఓర్ అవార్డును మెస్సీ అందుకున్నాడు. తాజాగా ప్యారిస్‌లో జరిగిన వేడుకల్లో మరోమారు ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు. మరో దిగ్గజ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో ఐదుసార్లు ఈ అవార్డును సొంతం  చేసుకున్నాడు.
 
ఈ అవార్డు కోసం మొత్తం 30 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేయగా, చివరికి రాబర్ట్ లెవాండోస్కీ, జోర్గిన్హోలను వెనక్కి నెట్టి మెస్సీ ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు.