లియోనల్ మెస్సీ అద్భుత రికార్డ్.. 644వ గోల్ సాధించి..?
సాకర్‌లో అర్టెంటీనా ఆటగాడు లియోనల్ మెస్సీ గొప్ప రికార్డు సాధించాడు. బార్సిలోనా తరఫున 644వ గోల్ సాధించి ఫుట్‌బాల్ చరిత్రలో ఒక క్లబ్ తరఫున అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. లా లీగా ఈవెంట్‌లో రియల్ వల్లడోలిడ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత అందుకున్నాడు. 65వ నిమిషంలో ప్రత్యర్థి నెట్‌లోకి బంతిని పంపించి ఈ ఆల్‌టైమ్ రికార్డును సృష్టించాడు.
అంతకుముందు అత్యధిక గోల్స్ రికార్డు బ్రెజిలియన్ దిగ్గజ ఆటగాడు పీలే పేరిట ఉండేది. ఆయన శాంటోస్ తరఫున 19 సీజన్లలో 665 మ్యాచ్‌ల్లో 643 గోల్స్ సాధించాడు. 33 ఏళ్ల మెస్సీ 17 సీజన్లలో 748 మ్యాచ్‌ల్లో పీలే రికార్డును అధిగమించాడు. కాగా.. 17ఏళ్ల వయసులో ఫుట్‌బాల్‌తో అద్భుతాలు సృష్టించడం మొదలుపెట్టిన మెస్సీ నాలుగు ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీలతో పాటు పది లా లీగా టైటిల్స్ గెలిచాడు.