ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. హోటల్‌లో బలవంతంగా అనుభవించాడు.. ఫుట్ బాల్ స్టార్?

Last Updated: ఆదివారం, 2 జూన్ 2019 (11:07 IST)
ప్రముఖ ఫుట్ బాల్ స్టార్ నెయ్ మార్‌పై అత్యాచారం ఆరోపణలు నమోదయ్యాయి. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు పెట్టారు.


ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన నెట్ మార్ అనే అమ్మాయిని ప్రేమ పేరిట లోబరుచుకుని పారిస్‌లోని ఓ హోటల్‌లో బలవంతంగా ఆమెను అనుభవించాడని ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు. హోటల్‌కు మత్తులో వచ్చిన నెయ్ మార్, తనపై అత్యాచారం చేశాడన్న ఆమె ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించారు.
 
కాగా, నెయ్ మార్ పై వచ్చిన ఆరోపణలను ఆయన తండ్రి శాంటోస్ ఖండించారు. ఇవన్నీ బ్లాక్ మెయిల్ చేసేందుకు చేస్తున్న ఆరోపణలేనని కొట్టిపారేశారు. తన బిడ్డ ఎలాంటి తప్పూ చేయలేదని, యువతి ఆరోపణలపై తమ వద్ద ఉన్న సాక్ష్యాలను న్యాయవాదులకు ఇచ్చామని చెప్పారు.దీనిపై మరింత చదవండి :