శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 నవంబరు 2021 (09:19 IST)

చనిపోయిందని ప్రచారం జరిగిన నిశా దహియా స్వర్ణం గెలిచింది...

మహిళా రెజ్లర్ నిశా దహియా చనిపోయిందంటూ ప్రచారం జరిగింది. కానీ, అదే రెజ్లర్ బంగారం పతకం సాధించింది. గురువారం ఉత్తరప్రదేశ్​లో జరిగిన జాతీయ మహిళా రెజ్లింగ్ ఛాంపియన్​పిష్​లో స్వర్ణపతకాన్ని కైవసం చేసుకుంది. రైల్వేస్ తరపున బరిలో దిగిన ఈమె.. 65 కిలోల విభాగంలో పతకం దక్కించుకుంది. 
 
ఇదిలావుంటే, బుధవారం హర్యానా రాష్ట్రంలో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో నిశా చనిపోయిందనే వార్తలు వచ్చాయి. తాను జాతీయ సీనియర్ పోటీల్లో పాల్గొనడంలో భాగంగా గోండాలో ఉన్నానని, తనకు ఏం కాలేదని వివరణ ఇచ్చింది. 
 
పైగా, తాను మరణించానంటూ వస్తున్న అసత్య వార్తలను కొట్టిపారేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను రెజ్లింగ్ ఫెడరేషన్​ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది. ఆ మరుసటి రోజే ఆమె బంగారు పతకాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం.