సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 31 ఆగస్టు 2019 (20:55 IST)

కోహ్లిని ఢీకొడతానంటున్న పి.వి.సింధు..ఎలా..?

పి.వి.సింధు బ్యాడ్మింటన్ స్టార్ మాత్రమే కాదు. ఆమె ఓ బ్రాండ్. ఇంటర్నేషనల్ బ్రాండ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. క్రికెటర్లు, టెన్నిస్, ఫుట్ బాల్ ప్లేయర్ మాత్రమే చోటు దక్కించుకునే ఫోర్బ్స్ జాబితాలో సింధు చేరడమే కాకుండా 13వ స్థానంలో నిలిచింది.
 
బ్యాడ్మింటన్‌లోనే కాదు బ్రాండ్‌లోనూ దిబెస్ట్. టాప్ బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గా సింధు, క్యూలో మరికొన్ని ఇంటర్సేషనల్ బ్రాండ్స్. నాలుగు దశాబ్దాల బారత్ కలను సాకారం చేసిన బ్యాడ్మింటన్ స్టార్. ఒలంపిక్స్‌లో రజిత పతకంతో చరిత్ర సృష్టించిన సింధు వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో బంగారం పతకంతో క్రీడాచరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 
 
జాతీయ, అంతర్జాతీయ సంస్ధలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. అంతర్జాతీయ బ్రాండ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అత్యంత ఆదాయం అందుకున్న వారి జాబితాలో ఇండియా నుంచి క్రికెటర్లే అధికంగా ఉన్నారు. ఉమెన్స్ జాబితాలో 7వ స్థానంలో ఉంది సింధు. కోహ్లి రోజుకు 2 కోట్ల సంపాదనతో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. కోహ్లి తరువాత రోజుకు కోటిన్నర తీసుకుంటూ సెకండ్ ప్లేస్‌లో నిలిచింది సింధు. చైనాకు చెందిన స్పోర్ట్స్ మెటీరియల్ సంస్ధతో పి.వి.సింధు 50 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. 2023 వరకు ఆమె ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండబోతోంది. ఇలా ఒక్కొక్క మైలురాయిని అధిగమిస్తూ ముందుకు సాగుతోంది.