త్వరలో పెళ్లి కూతురు కానున్న సానియా మీర్జా? వరుడు ఎవరంటే?
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా త్వరలో పెళ్లి కూతురు కానుంది. ఇటీవల తన భర్త షోయెబ్ అక్తర్‌కు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే.ఇక భారత క్రికెటర్ మహమ్మద్ షమీ కూడా తన భార్యకు దూరంగా ఉంటున్నాడు.
ఈ నేపథ్యంలో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పెళ్లి వార్తలపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు. అవన్నీ చెత్త వార్తలని, ఇప్పటి వరకు షమీని సానియా కలవలేదని ఇమ్రాన్ మీర్జా కొట్టిపారేశారు.
అయితే తాజాగా వీరిద్దరికీ వివాహం జరిగినట్టు మరో వార్తా ప్రచారంలోకి వచ్చింది. అంతేకాదు వీళ్లు దండలు మార్చుకున్న ఫోటోలు కూడా నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
అయితే, ఈ ఫోటోలు కూడా మార్ఫింగ్ చేసి ఎడిట్ చేసినవేనని తేలింది. సానియా మీర్జా హజ్ యాత్రకు వెళ్లింది. ఇటీవలే ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి కూడా రిటైర్ అయిన సంగతి తెలిసిందే.